కూలిన రైల్వే ప్లాట్‌ ఫామ్‌ గోడ

Dec 10,2023 21:57

ప్రజాశక్తి – ఉండి
మూడు రోజుల క్రితం కురిసిన భారీ వర్షానికి ఉండి రైల్వే స్టేషన్‌ ప్లాట్‌ ఫామ్‌ గోడ కుప్పకూలిపోయింది. మూడేళ్ల క్రితం గుడివాడ- భీమవరం రైల్వే డబ్లింగ్‌ పనుల్లో భాగంగా ఉండి రైల్వే స్టేషన్‌ను ఆధునీకరించారు. సంవత్సరం గడిచేసరికి ఫ్లాట్‌ఫారం రెండులో కొంతమేర పగుళ్లు వచ్చి బీటలు వారడంతో ప్రయాణికుల నుంచి పెద్ద ఎత్తున విమర్శలు రావడంతో రైల్వే అధికారులు దానిని తిరిగి నిర్మించారు. నాసిరకం సామగ్రి వాడడం వల్ల గోడ కూలిపోయిందని ఉండి ప్రయాణికుల సంఘం కార్యదర్శి చోడవరపు బంగారరావు అన్నారు. దీనిపై పూర్తిస్థాయిలో రైల్వే అధికారులు విచారణ చేయాలని పలువురు కోరుతున్నారు. దీనిపై ఉండి రైల్వే స్టేషన్‌ సూపరింటెండెంట్‌ ఏసుబాబును వివరణ కోరగా వివరణ ఇచ్చేందుకు ఆయన నిరాకరించారు. సీనియర్‌ సెక్షన్‌ ఇంజినీర్‌ రమేష్‌ను ఫోన్‌లో వివరణ కోరగా తమకు దీనిపై ఎటువంటి అవగాహన లేదని, తాను మూడు నెలల క్రితమే ఇక్కడకు బదిలీ అయ్యాయని తెలిపారు.

➡️