కోటి సంతకాలతో అంగన్‌వాడీల నిరనన

ప్రజాశక్తి – భీమవరం రూరల్‌

అంగన్వాడీల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ కోటి సంతకాల సేకరణ కార్యక్రమం భీమవరంలో శుక్రవారం నిర్వహించారు. అంగన్వాడీ వర్కర్స్‌ అండ్‌ హెల్పర్స్‌ యూనియన్‌, సిఐటియు ఆధ్వర్యంలో చేపట్టిన సమ్మె 32వ రోజు కొనసాగింది. ఈ సందర్భంగా అంగన్వాడీ వర్కర్స్‌ హెల్పర్స్‌ జిల్లా కార్యదర్శి కళ్యాణి, ఉపాధ్యక్షులు హసీనా మాట్లాడారు. వెల్ఫేర్‌ పార్టీ ఆఫ్‌ ఇండియా ఎండి మున్నార్‌ కమల్‌ పాషా, బార్‌ అసోసియేషన్‌ మాజీ జిల్లా అధ్యక్షులు న్యూటన్‌ బాబు సంఘీభావం తెలిపి మాట్లాడారు. కార్యక్రమంలో సిఐటియు జిల్లా అధ్యక్షులు జెఎన్‌వి గోపాలన్‌, యూని యన్‌ నాయకులు జి.విజయలక్ష్మి, శాంతకుమారి, దుర్గ, వెంకటలక్ష్మి, సిఐటియు మండల కార్యదర్శి ఇంజేటి శ్రీనివాస్‌ పాల్గొన్నారు. ఆచంట : కచేరీ సెంటర్లో అంగన్వాడీలు చేపట్టిన సమ్మె శుక్రవారానికి 32వ రోజుకు చేరుకుంది. ఈ సందర్భంగా అంగన్వాడీలు ఆటపాటలతో ముఖ్యమంత్రికి మంచి బుద్ధి ప్రసాదిం చాలని కోరుతూ నిరసన తెలిపారు. కార్యక్రమంలో మైలే విజయలక్ష్మి, పిఎన్‌వి.లక్ష్మి, కె.మోజారాణి, ఎ.సత్యవతి, సువర్ణకుమారి, శోభారాణి, ధనలక్ష్మి, దుర్గమ్మ, వెంకటరమణ పాల్గొన్నారు.తణుకు రూరల్‌ : తెలుగు ప్రజలకు ఎంతో ముఖ్యమైన సంక్రాంతి పండగ సమయంలో కూడా అంగన్వాడీలు ఆందోళన చేసేవిధంగా చేయడం ప్రభుత్వానికి మంచిది కాదని సిఐటియు జిల్లా కార్యదర్శి పివి.ప్రతాప్‌ హెచ్చరించారు. కోర్టు వద్ద 32వ రోజు సమ్మెలో భాగంగా ముఖ్యమంత్రికి కోటి సంతకాల సేకరణ కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా ప్రతాప్‌ మాట్లాడారు. కార్యక్రమంలో సిఐటియు నాయకులు గార రంగారావు, కనక దుర్గ, ప్రమీల, వసంతకుమారి, మణిమాలతి, జ్యోతి, రాజకుమారి, ధనలక్ష్మి, మంగతాయారు పాల్గొన్నారు.ఆచంట (పెనుమంట్ర) : అంగన్వాడీలు 32 రోజులుగా సమస్యలు పరిష్కరించాలని సమ్మె చేస్తున్నా ప్రభుత్వం విచ్ఛిన్నం చేసేందుకు ప్రయత్నించడం దారుణమని సిఐటియు మండల కార్యదర్శి కోడే శ్రీనివాస్‌ ప్రసాద్‌ అన్నారు. అంగన్‌వాడీల దీక్షలు కొనసాగాయి. ఎస్మా జిఒ కాగితం నాలుక గీసికోవడానికా అంటూ నాలుక గీసుకుంటూ నిరసన తెలిపారు. కార్యక్రమంలో కెవిపిఎస్‌ జిల్లా అధ్యక్షులు బత్తుల విజయకుమార్‌, అంగన్వాడీ సెక్టార్‌ నాయకులు సాయి మహాలక్ష్మి, మౌనిక, సరస్వతి పాల్గొన్నారు.కాళ్ల : చర్చల్లో అంగన్‌వాడీల సమస్యలు పరిష్కరించాలని లేకుంటే పండగ తరువాత ప్రభుత్వంతో యుద్ధమే జరుగుతుందని అంగన్వాడీ టీచర్స్‌ అండ్‌ హెల్పర్స్‌ యూనియన్‌ ప్రాజెక్టు లీడర్‌ దావులూరి మార్తమ్మ హెచ్చరించారు. తహశీల్దార్‌ కార్యాలయం వద్ద అంగన్వాడీల సమ్మె 32వ రోజుకు చేరింది. ఈ సందర్భంగా భోగి మంటల్లో ఎస్మా జిఒ కాపీని వేసి నిరసన తెలిపారు. కార్యక్రమంలో సిఐటియు మండల అధ్యక్షులు గొర్ల రామకృష్ణ, అంగన్వాడీ టీచర్స్‌ అండ్‌ హెల్పర్స్‌ పాల్గొన్నారు.తాడేపల్లిగూడెం : అంగన్‌వాడీలపై ఎస్మా ప్రయోగించడం దుర్మార్గపు చర్యని సిఐటియు జిల్లా కార్యదర్శి కర్రి నాగేశ్వరరావు ప్రభుత్వాన్ని విమర్శించారు. తహశీల్దార్‌ కార్యాలయం వద్ద సిఐటియు పట్టణ కమిటీ ఆధ్వర్యంలో అంగన్వాడీలు చేపట్టిన సమ్మె 32వ రోజుకు చేరింది. కర్రి నాగేశ్వరరావు, అంగన్వాడీ వర్కర్స్‌ యూనియాన్‌ ప్రాజెక్టు అధ్యక్షరాలు దీన స్వరూపారాణి మాట్లాడారు. కార్యక్రమంలో సిఐటియు పట్టణ కమిటీ నాయకులు యడవల్లి వెంకట దుర్గారావు, అంగన్వాడీలు పాల్గొన్నారు.గణపవరం : 32వ రోజు సమ్మెలో దీక్షా శిబిరం వద్ద అంగన్‌వాడీలు ముగ్గులు రూపంలో నిరసన తెలిపారు. ఈ సందర్భంగా అంగన్వాడీ మండల కమిటీ నాయకురాలు బి.రామకోటి, బి.మహాలక్ష్మి మాట్లాడారు. కార్యక్రమంలో అంగన్వాడీ నాయకులు ధనలక్ష్మి బి.పార్వతి, కెవి మహాలక్ష్మి, జయలక్ష్మి, కళ్యాణి పాల్గొన్నారు.పెనుగొండ: అంగన్‌వాడీల సమస్యలు పరిష్కరించాలని వి.నాగలక్ష్మి అన్నారు. శుక్రవారం 32వ రోజు అంగన్వాడీలు కుటుంబ సభ్యులతో కూర్చున్నారు. కార్యక్రమంలో అంగన్వాడీలు, సిఐటియు నేతలు ఎస్‌.వెంకటేశ్వరరావు, ఎల్‌.ఉషశ్రీ, సిహెచ్‌.త్రివేణి, కె.శాంతి శ్రీదేవి పాల్గొన్నారు.మొగల్తూరు : అంగన్వాడీల సమ్మెకు మద్దతుగా ప్రజల నుండి సంతకాలు సేకరించారు. కార్యక్రమంలో పెద్దింట్లు, సారమ్మ, సీత, నాగలక్ష్మి, రేఖ శాంభవి పాల్గొన్నారు.పోడూరు : తహశీల్దార్‌ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహిస్తున్న అంగన్వాడీలు 32వ రోజు ముగ్గులు వేసి నిరసన తెలిపారు. కార్యక్రమంలో ప్రాజెక్ట్‌ లీడర్‌ పీతల రాజమణి, జె.ఉమాదేవి, రాయుడు కుమారి, సిఐటియు నాయకులు పిల్లి.ప్రసాద్‌, బూరాబత్తుల వెంకట్రావు పాల్గొన్నారు.అత్తిలి : 32న శుక్రవారం అంగన్‌వాడీలు అధికారులు ఇచ్చిన షోకాజ్‌ నోటీసులను రాకెట్లుగా చేసి చెవిలో పెట్టుకుని భోగి మంటల్లో వేసి నిరసన తెలిపారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా కార్యదర్శి రాజా రామ్మోహన్‌ రారు, మండల కార్యదర్శి కర్రి ధర్మేంద్ర, కౌలు రైతు సంఘం నాయకులు కేతా గోపాలన్‌ పాల్గొన్నారు.పెంటపాడు : అంగన్వాడీల సమ్మె 32వ రోజుకు చేరింది. ఈ మేరకు శిబిరం వద్ద సంతకాల సేకరణ, ముగ్గులు వేసి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా అంగన్వాడీ యూనియన్‌ జిల్లా అధ్యక్షురాలు ఝాన్సీ, నాయకులు జై.శ్యామలకుమారి, ఆర్‌.అనురాధ, వి.కనకమహాలక్ష్మి, సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు సిరపరపు రంగారావు మాట్లాడారు. జయలక్ష్మి సిహెచ్‌.శ్రీదేవి, హైమ, వెంకటలక్ష్మి, నాగమణి, శిరీష, మంగతాయారు, పి.దుర్గ పాల్గొన్నారు.ఆకివీడు : అంగన్‌వాడీల సమ్మె కొనసాగింది. ఈ మేరకు శుక్రవారం కోటి సంతకాల సేకరణ కార్యక్రమం చేపట్టారు. సిఐటియు మండల అధ్యక్షులు పెంకి అప్పారావు మాట్లాడారు. కార్యక్రమంలో తవిటినాయుడు, కృష్ణకుమారి, పైడేశ్వరి, కె.కృష్ణకుమారి, భాను, భవాని, అమోజీ పాల్గొన్నారు.ఉండి : పండుగ సమయాల్లో కూడా అంగన్వాడీలు తమ డిమాండ్లు నెరవేర్చుకునేందుకు సమ్మెలో పాల్గొంటున్నారని సిఐటియు మండల అధ్యక్షులు ధనికొండ శ్రీనివాస్‌ అన్నారు. తహశీల్దార్‌ కార్యాలయం వద్ద అంగన్వాడీలు చేస్తున్న సమ్మె 32వ రోజుకు చేరింది. ఈ సందర్భంగా ధనికొండ శ్రీనివాస్‌ మాట్లాడారు. కార్యక్రమంలో అంగన్వాడీలు చైతన్య, గడి కుసుమ, వీరవల్లి వెంకటలక్ష్మి, జయశ్రీ, అనురాధ, ప్రేమలత, లలిత కుమారి, ఝాన్సీ, సత్యవేణి పాల్గొన్నారు.పాలకోడేరు: అంగన్వాడీల సమస్యలు పరిష్కరించడంలో వైసిపి ప్రభుత్వం విఫలమైందని జనసేన ఉండి నియోజకవర్గ ఇన్‌ఛార్జి జుత్తిగ నాగరాజు విమర్శించారు. 32వ రోజు సమ్మెలో భాగంగా జనసేన నాయకులు మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా నాగరాజు మాట్లాడారు. అలాగే సిఐటియు జిల్లా నాయకులు బి.వాసుదేవరావు, ఎం.ఆంజనేయులు సమ్మె శిబిరాన్ని సందర్శించి సంఘీభావం తెలిపారు. కార్యక్రమంలో జనసేన నాయకులు గాదం నానాజీ, అంగన్వాడీలు విజయలక్ష్మి, విమల, సోని, మంగతాయారు, నాగలక్ష్మి, జ్యోతి పాల్గొన్నారు.పాలకొల్లు : తహశీల్దార్‌ కార్యాలయం వద్ద అంగన్వాడీలు ఆటపాటలతో సమ్మె కొనసాగించారు. సమ్మెకు సిఐటియు నేతలు మద్దతు తెలిపారు.

➡️