పాడి పశువులకు టీకాలు

Dec 5,2023 16:44

ప్రజాశక్తి – పోడూరు
మిచౌంగ్‌ తుపాన్‌ ప్రభావంతో వాతావరణంలో మార్పులు రావడంతో పశువులకు దొమ్మ వ్యాధి రాకుండా నివారణ టీకాలు వేస్తున్నట్లు మండల పశువైద్యాధికారి ఎస్‌.మహేష్‌కుమార్‌ తెలిపారు. మండంలోని వద్దిపర్రు గ్రామంలో ఉన్న పశువులకు మంగళవారం టీకాలు వేశారు. ఈ సందర్భంగా డాక్టర్‌ మహేష్‌కుమార్‌ మాట్లాడుతూ పంట కాలువలు, మురుగు కాలువలు, పరివాహక గ్రామాల్లోని కలుషిత నీటి వల్ల దొమ్మ వ్యాధి వచ్చే అవకాశం ఎక్కువగా ఉందన్నారు. రైతులందరూ తమ పశువులకు టీకాలు వేయించాలని కోరారు. పశువు చనిపోతే సంబంధిత రైతు భరోసా కేంద్రంలోని పశు సహాయకునికి విఆర్‌ఒ ద్వారా పశువైద్యులకు సమాచారం అందిస్తే నష్టపరిహారం అందిస్తారని తెలిపారు. ఈ కార్యక్రమలో పశు సంవర్థక శాఖ సహాయకురాలు సిహెచ్‌.సుప్రియ, గోపాలమిత్ర రాపాక సుబ్బారావు పాల్గొన్నారు.

➡️