11వ రోజుకు అంగన్‌వాడీల సమ్మె

సమస్యలు పరిష్కరించేవరకూ ఉద్యమం ఆగదు
తమ సమస్యలు పరిష్కరించాలని అంగన్‌వాడీలు చేపట్టిన సమ్మె శుక్రవారంతో 11వ రోజుకు చేరింది. సమస్యలు పరిష్కరించేవరకూ ఉద్యమం ఆగదని అంగన్‌వాడీలు స్పష్టం చేశారు.
 ప్రజాశక్తి – భీమవరం రూరల్‌
విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ మూడు నెలల తర్వాత జీతాలు పెంచుతున్న నా మాటలు సిగ్గుచేటని సిఐటియు జిల్లా కమిటీ సభ్యులు బి. వాసుదేవరావు అన్నారు భీమవరం శుక్రవారం అంగన్వాడి వర్కర్స్‌ హెల్పర్స్‌ యూనియన్‌ సిఐటియు ఆధ్వర్యంలో 11వ రోజు సమ్మె కొనసాగింది. సమ్మె శిబిరం వద్ద నుండి ర్యాలీగా నినాదాలు చేసుకుంటూ స్థానిక ప్రకాశం చౌక్‌ సెంటర్లో రాస్తారోకో చేశారు. ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా కార్యదర్శి ప్రసాద్‌ మాట్లాడారు. కార్యక్రమంలో గణేష్‌, శాంతి, అంగన్‌వాడీ వర్కర్స్‌ హెల్ప ర్స్‌ యూనియన్‌ నాయకులు దుర్గ, మేరీగ్రేస్‌, సిఐటియు మండల కార్యదర్శి ఇంజేటి శ్రీనివాస్‌ సావిత్రి పాల్గొన్నారు. పాలకోడేరు : సమ్మె శిబిరం వద్ద నుంచి ర్యాలీగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా అధ్యక్షులు జెఎన్‌వి.గోపాలన్‌ మాట్లాడారు. సమ్మెకు ఎస్‌ఎఫ్‌ఐ సంఘం సంపూర్ణ మద్దతు పలుకుతుందన్నారు.పాలకొల్లు : శుక్రవారం 11వ రోజు తహశీల్దార్‌ కార్యాలయం వద్ద అంగన్‌వాడీలు మానవహారం చేపట్టారు. తమ డిమాండ్లను పరిష్కరించే వరకూ సమ్మె ఆగదని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో అంగన్‌వాడీ నేతలు ఎం.శ్రీదేవి, బి.నాగలక్ష్మి, పి.పద్మావతి, ఎం.ఏనసమ్మ, సిఐటియు మండల కార్యదర్శి జవ్వాది శ్రీనివాస్‌, పురుషోత్తం, చల్లా సోమేశ్వర రావు, అంగన్వాడీలు పాల్గొన్నారు.కాళ్ల : అంగన్‌వాడీల సమస్యలు పరిష్కరించకపోతే ఆందోళన ఉధృతం చేస్తామని ఆకివీడు ప్రాజెక్టు లీడర్‌ దావులూరి మార్తమ్మ డిమాండ్‌ చేశారు. తహశీల్దార్‌ కార్యాలయం ఎదురుగా అంగన్‌వాడీ వర్కర్స్‌ అండ్‌ హెల్పర్స్‌ రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు. కార్యక్రమంలో అంగన్‌వాడీ సెక్టార్‌ లీడర్స్‌ యడవల్లి చంద్రావతి, ఝాన్సీ లక్ష్మీబాయి, కమల, రాజమణి, ఝాన్సీ, సిఐటియు మండల అధ్యక్షులు గొర్ల రామకృష్ణ పాల్గొన్నారు.ఉండి : ఇచ్చిన వాగ్దానాలను నెరవేర్చకుంటే వచ్చే ఎన్నికల్లో తగిన గుణపాఠం చెబుతామని అంగన్‌వాడీ వర్కర్స్‌ అండ్‌ హెల్పర్స్‌ యూనియన్‌ జిల్లా సహాయ కార్యదర్శి మహమ్మద్‌ హసీనా బేగం రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు. తహశీల్దార్‌ కార్యాలయం వద్ద అంగన్‌వాడీలు చేపట్టిన సమ్మె 11వ రోజుకు చేరుకుంది. సమ్మెలో పాల్గొన్న అంగన్‌వాడీలు గడ్డి తింటూ తహశీల్దార్‌ కార్యాలయం నుంచి సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయం వరకూ ర్యాలీగా వెళ్లి మానవహారం నిర్వహించారు. సిఐటియు మండల అధ్యక్షులు ధనికొండ శ్రీనివాస్‌ మాట్లాడారు. ఆచంట : ఆచంట కచేరీ సెంటర్లో అంగన్‌వాడీలు చేపట్టిన సమ్మె కొనసాగింది. ఈ సందర్భంగా ఆచంట కచేరీ సెంటర్లో సమస్యలు పరిష్కరించాలని రాస్తారోకో నిర్వహించి నిరసన తెలిపారు. సమ్మెకు సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు కేతా గోపాలన్‌ సంఘీభావం తెలిపి మాట్లాడారు. కార్యక్రమంలో సిఐటియు మండల కార్యదర్శి వద్దిపర్తి అంజిబాబు, అంగన్‌వాడీలు మైలే విజయలక్ష్మి, గుత్తుల శ్రీదేవి, మహేశ్వరి, బి.కమల, సత్యవతి, గౌరీశ్వరి, నాగలక్ష్మి, సుజాత, వెంకటలక్ష్మి పాల్గొన్నారు.తాడేపల్లిగూడెం : సమస్యలు పరిష్కరిం చాలని అంగన్‌వాడీలు సమ్మె చేపట్టి పదకొండు రోజులైనా ప్రభుత్వం నుంచి ఎటువంటి హామీ రాకపోవడం ఆశ్చర్యంగా ఉందని అంగన్‌వాడీ వర్కర్స్‌ యూనియన్‌ ప్రాజెక్ట్‌ అధ్యక్షురాలు స్వరూపారాణి, సిఐటియు పట్టణ కార్యదర్శి కరెడ్ల రామకృష్ణ, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా నాయకులు కండెల్లి సోమరాజు, ఐద్వా నాయకురాలు పి.జయమ్మ ఆవేదన వ్యక్తం చేశారు. తాడేపల్లిగూడెం మండల సెక్టార్‌ ఆధ్వర్యంలో అంగన్‌వాడీలు తహశీల్దార్‌ కార్యాలయం వద్ద చేపట్టిన సమ్మె కొనసాగింది. సమ్మెకు సిఐటియు పట్టణ, మండల కమిటీ, ఐద్వా మండల కమిటీ సంఘీభావం తెలిపింది. అనంతరం తహశీల్దార్‌ కార్యాలయం నుండి పోలీసు ఐల్యాండ్‌ వరకూ ర్యాలీ నిర్వహించి అక్కడ రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. కార్యక్రమంలో సిఐటియు పట్టణ కార్యదర్శి కరెడ్ల రామకృష్ణ, యడవల్లి వెంకట దుర్గారావు, అంగనవాడీ వర్కర్స్‌ అండ్‌ హెల్పర్స్‌ యూనియన్‌ సభ్యులు పాల్గొన్నారు.యలమంచిలి : అంగన్‌వాడీల సమ్మె కొనసాగింది. స్థానిక సెంటర్‌ వద్ద వందలాది మంది అంగన్‌వాడీ వర్కర్స్‌, హెల్పర్లు మానవహారం నిర్వహించి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా సిఐటియు మండల కార్యదర్శి దేవ సుధాకర్‌ మాట్లాడారు. ఈ కార్యక్రమంలో యలమంచిలి, మేడపాడు, దొడ్డిపట్ల సెక్టార్ల లీడర్లు రజని, దేవి, పద్మశ్రీ పాల్గొన్నారు.పోడూరు: అంగన్‌వాడీలు చేపట్టిన సమ్మె కొనసాగింది. బస్టాండ్‌ సెంటర్‌ వద్ద వందల మంది అంగన్‌వాడీలు మానవహారం నిర ్వహించి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా సిఐటియు మండల కార్యదర్శి పిల్లి.ప్రసాద్‌ మాట్లాడారు. కార్యక్రమంలో టిడిపి నాయకులు దాసరి రత్నరాజు, పాలవలస తులసీరావు, ప్రాజెక్ట్‌ లీడర్‌ పీతల రాజమణి, జె.ఉమాదేవి, రాయుడు కుమారి పాల్గొన్నారు.గణపవరం : సమస్యలు పరిష్కరించాలని కోరుతూ అంగన్‌వాడీలు 11వ రోజు చెవిలో పువ్వులు పెట్టుకుని నిరసన తెలిపారు. అనంతరం మానవహారం నిర్వహించారు. ఈ సందర్భంగా సిఐటియు మండలాధ్యక్షులు ఎం.పెంటారావు, అంగన్‌వాడీ మండల నాయకులు బి.రామకోటి మాట్లాడారు. కార్యక్రమంలో అంగన్‌వాడీ నాయకులు కెవి.మహాలక్ష్మి, ఎ.కళ్యాణి, సిహెచ్‌.మహాలక్ష్మి వికె.జయలక్ష్మి, ధనలక్షి పాల్గొన్నారు.అత్తిలి : తహశీల్దార్‌ కార్యాలయం వద్ద అంగన్‌వాడీల సమ్మెకు సామాజిక న్యాయ పోరాట సమితి వ్యవస్థాపక అధ్యక్షులు పేరూరి మురళీకుమార్‌, రాష్ట్ర గౌరవ అధ్యక్షులు అంబేద్కర్‌ మద్దతు తెలిపారు. ఈ కార్యక్రమంలో సిఐటియు నాయకులు కర్రి ధర్మేంద్ర, కౌలు రైతు సంఘం నాయకులు కేతా గోపాలన్‌ పాల్గొన్నారు.మొగల్తూరు : దీక్షా శిబిరాన్ని అంగన్‌వాడీ సంఘం జిల్లా కార్యదర్శి డి.కల్యాణి సందర్శించి సంఘీభావం తెలిపారు. అనంతరం స్థానిక గాంధీ బొమ్మ సెంటర్‌ వరకు ప్రదర్శనగా వెళ్లి రాస్తారోకో చేశారు. ఈ కార్యక్రమంలో సంఘం జిల్లా సహాయ కార్యదర్శి రాణి, జిల్లా కమిటీ సభ్యులు జె.ఉమాదేవి, సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు తెలగంశెట్టి సత్యనారాయణ, నాయకులు యడ్ల చిట్టిబాబు, ఆదూరి సాంబమూర్తి పాల్గొన్నారు.ఆచంట (పెనుమంట్ర) : తహశీల్దార్‌ కార్యా లయం వద్ద అంగన్‌వాడీలు గడ్డి తిని నిరసన తెలిపారు. పెనుమంట్ర నుంచి బ్రాహ్మణ చెరువు వరకు ర్యాలీ, రాస్తారాకో నిర్వహించారు. ఈ సందర్భంగా సిఐటి యు మండల కార్యదర్శి కోడే శ్రీనివాసప్రసాద్‌ మాట్లాడారు. ఆకివీడు : స్థానిక జాతీయ రహదారిపై రాస్తారోకో చేశారు. అంగన్‌వాడీలు గడ్డి తింటూ రాస్తారోకోలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి అంగన్‌వా డీల జిల్లా సహాయ కార్యదర్శి హసీనా నాయకత్వం వహిం చారు. ఈ కార్యక్రమంలో దుర్గ, వాణి, లక్ష్మి, రమాకుమారి, రామలక్ష్మి, కనకదుర్గ, కృష్ణకుమారి పాల్గొన్నారు.ఇరగవరం : అంగన్‌వాడీలు పచ్చగడ్డి తింటూ నిరసన తెలిపారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా ఉపాధ్యక్షురాలు అడ్డగర్ల అజయకుమారి మాట్లా డారు. డిఒసి నాయకులు అధ్యక్ష, కార్యదర్శులు జి.గోపీ, వెంకటేశ్వరరావు మద్దతు తెలిపారు. టిడిపి నాయకులు అండన్‌వాడీలకు ఆహారం అందించి మద్దతు తెలిపారు. నరసాపురం టౌన్‌ : స్థానిక అంబేద్కర్‌ సెంటర్‌లో రోడ్డుపై బైఠాయించి రాస్తారోకో నిర్వహిం చారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు కల్యాణి దీక్ష శిబిరం వద్దకు వచ్చి మద్దతు తెలిపారు. సిఐటియు జిల్లా కార్యదర్శి త్రిమూర్తులు మాట్లాడారు. పెనుగొండ : స్థానిక బస్టాండ్‌ సెంటర్‌లో రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా అంగన్‌వాడీల సంఘం మండల కార్యదర్శి కె.తులసి మాట్లాడారు. ఈ కార్యక్రమంలో సిఐటియు నాయకులు నాగిశెట్టి గంగారావు, ఎల్‌.ఉషశ్రీ, నాగలక్ష్మి, సుబ్బమ్మ, ఉందుర్తి దుర్గ పాల్గొన్నారు.

➡️