ప్రభుత్వ తీరు మారకుంటే ఆందోళన తీవ్రతరం

Dec 13,2023 15:55 #West Godavari District
anganwadi protest 2nd day wg akividu

జిల్లా సహాయ కార్యదర్శి హసీనా బేగం హెచ్చరిక.

ప్రజాశక్తి-ఆకివీడు : అంగన్వాడీల పట్ల ప్రభుత్వ విధానం మారకుంటే ఆందోళన మరింత తీవ్రతరం చేస్తామని ఎంతకాలమైనా కొనసాగిస్తామని అంగన్వాడీల అసోసియేషన్ జిల్లా సహాయ కార్యదర్శి ఎండి హసీనా బేగం ప్రభుత్వాన్ని హెచ్చరించారు. పని భారం రోజు ప్రభుత్వం పెంచుతుందని ఆరు సేవలు అంగన్వాడీలు అందిస్తున్నారని ఆమె చెప్పారు. అంగన్వాడి వర్కర్స్ అండ్ హెల్పర్స్ అసోసియేషన్ సిఐటియు ఆధ్వర్యంలో రాష్ట్ర స్థాయిలో చేపట్టిన సమ్మెలో భాగంగా మండలంలో సమ్మె రెండో రోజు కొనసాగుతోంది. స్థానిక పాత బస్టాండ్ సెంటర్లో అంగన్వాడీల సమ్మె శిబిరంలో పాల్గొని ఆమె మాట్లాడారు. అంగన్వాడీలకు 60 శాతం నిధులు కేంద్ర ప్రభుత్వం అందిస్తుందని, అయితే రాష్ట్ర ప్రభుత్వం తన పేరు చెప్పుకుంటూ మోసం చేస్తుందని ఆమె ఆరోపించారు. ఉద్యోగాల నుంచి తొలగించే హక్కు రాష్ట్ర ప్రభుత్వానికి లేదన్నారు. అంగన్వాడీలో పిల్లలకు అనారోగ్యమైతే ఆసుపత్రులకు తీసుకెళ్లి ఖర్చులు కార్యకర్తల భరించవలసి వస్తుందన్నారు. సురక్ష పథకం బోర్డులకే పరిమితమవుతున్నాయి అన్నారు. ప్రతి నెల అంగన్వాడీలు ప్రభుత్వానికి రెండు నుంచి మూడు వేల రూపాయలు ఎదురు పెట్టుబడి పెడుతున్నారని ఆమె వివరించారు. కోర్కెలు ప్రభుత్వం నెరవేర్చే వరకు సమ్మె విరమించేది లేదని ఆమె స్పష్టం చేశారు. కార్యక్రమంలో సిఐటియు నాయకులు పెంకి అప్పారావు, తవిటి నాయుడు, షేక్ వలి, అంగన్వాడి యూనియన్ నాయకులు వి. పైడేశ్వరి, ఎన్. కనకదుర్గ, కాలీ. విజయలు మాట్లాడారు.

➡️