కాంగ్రెస్‌ అభ్యర్థి వేగేశ్నవెంకట గోపాలకృష్ణంరాజు ప్రచారం

May 3,2024 14:13 #Congress

ప్రజాశక్తి-కాళ్ళ :
కాళ్లకూరు గ్రామ ప్రజలు చూపిస్తున్న ప్రేమ, అభిమానానికి ఎప్పటికీ ఇలాగే ఉండాలనీ, తనను గెలిపిస్తే మంచిగా ప్రజా సేవను చేస్తానని ఉండి కాంగ్రెస్‌ ఎమ్మెల్యే అభ్యర్థి వేగేశ్నవెంకట గోపాలకృష్ణంరాజు అన్నారు.మండలంలోని కాళ్లకూరు స్వగ్రామంలో ఎన్నికల ప్రచారాన్ని కాంగ్రెస్‌ ఎమ్మెల్యే అభ్యర్థి వేగేశ్నవెంకట గోపాలకఅష్ణంరాజుశుక్రవారం నిర్వహించారు. ఈసందర్భంగా మాట్లాడుతూ గ్రామ సర్పంచ్‌గా, ఎంపిటిసిగా గెలిపించడంతో ఎంపిపిగా పనిచేసే అవకాశం వచ్చిందన్నారు. ఎన్నికల్లో ఎమ్మెల్యేగా తనను గెలిపించాలని కోరారు. సేవాభావంతోనే రాజకీయాల్లోకి వచ్చానన్నారు. తనను గెలిపిస్తే అందరికీ నిస్వార్ధంగా సేవ చేస్తానన్నారు. ఈ కార్యక్రమంలో కుటుంబ సభ్యులు గ్రామ నాయకులు, గ్రామ మహిళా నాయకులు, గ్రామ పెద్దలు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

➡️