నిష్పక్షపాతంగా విధులు నిర్వహించాలి 

Apr 12,2024 14:43 #West Godavari District

ఆచంటలో శిక్షణా తరగతుల్లో మాట్లాడుతున్న రిటర్నింగ్ అధికారి పర్యాటకశాఖ రీజనల్ డైరెక్టర్  వి స్వామినాయుడు
ప్రజాశక్తి-ఆచంట(పశ్చిమగోదావరి జిల్లా) : సాధారణ ఎన్నికలలో పాల్గొనే అధికారులు సిబ్బంది నిష్పక్షపాతంగా వ్యవహరించాలని ఆచంట రిటర్నింగ్ అధికారి పర్యాటక శాఖ రీజనల్ డైరెక్టర్  వి స్వామినాయుడు అన్నారు. నియోజకవర్గస్థాయిలో ఎన్నికల విధులు నిర్వహించే పీవో ఏపీవో లకు   పశ్చిమగోదావరి జిల్లా ఆచంట మండలం ఆచంట  ఎం వి ఆర్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో శుక్రవారం రెండో రోజు పిఓపిఓ లకు  శిక్షణ తరగతులు నిర్వహించారు. ఈ సందర్భంగా జరిగిన శిక్షణ కార్యక్రమంలో స్వామి నాయుడు మాట్లాడుతూ ఓటు వేసేందుకు వచ్చే ఓటర్లకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ఎటువంటి రాజకీయ ఒత్తులకు గురికాకుండా వివాదారహితంగా పోలింగ్ ప్రక్రియను పూర్తి చేయాలని కోరారు. ప్రిసైడింగ్, సహాయ ప్రిసైడింగ్ అధికారులు పోలింగ్ యూనిట్స్ పనితీరు డిస్ట్రిబ్యూషన్, పోలింగ్ అనంతరం రెసిస్టన్ కేంద్రంలో కీలకమైన బాధ్యతలు నిర్వహించవలసి ఉంటుందని అన్నారు. పివో, ఏపీవోలు ఎన్నికల బ్యాలెట్ యూనిట్, కంట్రోల్ యూనిట్, వివి ప్యాడ్స్ పనితీరు పై పూర్తి అవగాహన కలిగి ఉండాలన్నారు. అధికారులు ఎటువంటి  సందేశాలు ఉన్నా నివృత్తి చేసుకోవాలన్నారు. ఈ శిక్షణ కార్యక్రమంలో టెండర్ బ్యాలెట్, ఛాలెంజింగ్ ఓట్లు, టెస్ట్ ఓట్లు తో పాటు ఐదు పోలింగ్ అధికారులు విధుల్లో ఉంటారన్నారు. ఈ సందర్భంగా ఈవీఎం రీప్లేస్మెంటు విధానం వివిధ ఫారంలో పూర్తి చేసే విధానంపై శిక్షణ ఇచ్చి అనంతరం పరీక్షలు నిర్వహించారు. ఈ  శిక్షణ కార్యక్రమానికి 232 మంది తరగతుల్లో పాల్గొన్నారు.  ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారి ఐపీ శెట్టి, ఎంపీడీవో పి నరసింహ ప్రసాద్, పెనుమంట్ర తాసిల్దార్ లక్ష్మీ కళ్యాణి, డిప్యూటీ తాసిల్దారు లు రాంప్రసాద్ రాజు, సుగుణ సంధ్య, ఆర్ ఐ జయలలిత, నాగిరెడ్డి, జి నరసింహారావు, వివిధ శాఖల అధికారులు  పాల్గొన్నారు.

➡️