చంద్రయ్య మృతి తీరని లోటు

సిపిఎం జిల్లా కార్యదర్శి బలరాం

ప్రజాశక్తి – భీమవరం టౌన్‌

ఇంజేటి చంద్రయ్య మృతి పేదలకు, దళితులకు తీరనిలోటు అని సిపిఎం జిల్లా కార్యదర్శి బి.బలరాం అన్నారు. గురువారం మధ్యాహ్నం ఆకస్మికంగా మృతి చెందిన ఇంజేటి చంద్రయ్య భౌతిక దేహాన్ని శుక్రవారం సిపిఎం జిల్లా కార్యదర్శి బి.బలరాం, జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు జెఎన్‌వి.గోపాలన్‌ సందర్శించి నివాళులర్పించారు. ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కార్యదర్శి బి.బలరాం మాట్లాడుతూ పేదలు, దళితుల పక్షాన నిలిచి ఏ సమస్య ఉన్నా పోరాడే వ్యక్తి ఇంజేటి చంద్రయ్య అని కొనియాడారు. 12 ఏళ్ల క్రితం వెంప బస్టాండ్‌ పోరాటంలో అగ్రభాగాన ఉండి ఉద్యమించిన ధైర్యశాలి చంద్రయ్య అన్నారు. చంద్రయ్య తమ్ముడు ఇంజేటి శ్రీనివాసరావు సిపిఎం మండల కన్వీనర్‌గా పనిచేస్తున్నట్లు తెలిపారు. ఆయన మృతికి ప్రగాఢ సంతాపం తెలిపారు. కుటుంబ సభ్యులకు సానుభూతి తెలిపారు. నివాళులర్పించిన వారిలో కెవిపిఎస్‌ జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు బత్తుల విజరు కుమార్‌, కె.క్రాంతిబాబు, చంద్రయ్య, సోదరులు సిపిఎం మండల కన్వీనర్‌ ఇంజేటి శ్రీనివాసరావు, ఇంజేటి త్రిమూర్తులు, ఇంజేటి రవికుమార్‌, కుటుంబ సభ్యులు, బంధువులు, గ్రామస్తులు పాల్గొన్నారు.

➡️