అవును.. నేను అన్‌ఫిట్‌..!

డిప్యూటీ ఆర్‌ఐఒ నాగేశ్వరరావు

ఎస్‌ఆర్‌ కళాశాల వద్ద ఎస్‌ఎఫ్‌ఐ ఆందోళన

ప్రజాశక్తి – భీమవరం టౌన్‌ ‘

అవును.. నేను అన్‌ఫిట్‌.. నేను ఎటువంటి చర్యలూ తీసుకోలేను. నాకు ఎటువంటి అధికారాలూ లేవు. కేవలం నా పని ప్రభుత్వ కళాశాలల్లో ఏమైనా అక్రమాలు జరిగితే చర్యలు తీసుకోవడమే. ప్రయివేట్‌ కళాశాలల్లో ఏం జరిగినా నేను ఎటువంటి చర్యలూ తీసుకోలేను.. అంతా ఆర్‌ఐఒనే చూసుకుంటారు’ అని డిప్యూటీ ఆర్‌ఐఒ నాగేశ్వరరావు చెప్పడం అందరినీ విస్మయపర్చింది. స్థానిక బైపాస్‌ రోడ్‌లోని ఎస్‌ఆర్‌ కళాశాలలో నిబంధనలకు విరుద్దంగా పుస్తకాలు అమ్ముతున్నారని, వాటిని సీజ్‌ చేయాలని ఎస్‌ఎఫ్‌ఐ నేతలు ఆర్‌ఐఒకు సమాచారం ఇచ్చారు. ఆర్‌ఐఒ అందుబాటులో లేకపోవడంతో డిప్యూటీ ఇంటర్మీడియట్‌ అధికారి నాగేశ్వరరావును పంపించారు. నాగేశ్వరరావు ఎస్‌ఎఫ్‌ఐ నేతలను పట్టించుకోకుండా కళాశాల యాజమాన్యంతో మాట్లాడి రేపు ఆర్‌ఐఒ వస్తారు.. వెళ్లిపోండని ఎస్‌ఎఫ్‌ఐ నేతలకు సూచించారు. దీనిపై అక్కడున్న మీడియా ప్రతినిధులు మీరేమీ చర్యలు తీసుకోరా అంటే పై విధంగా స్పందించారు. అనంతరం అక్కడ నుంచి వెళ్లిపోయారు. దీనిపై ఎస్‌ఎఫ్‌ఐ నేతలు గేటు వద్ద కొద్దిసేపు ఆందోళన నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా కార్యదర్శి టి.ప్రసాద్‌ మాట్లాడారు.

➡️