దాతల సహకారం అభినందనీయం

ప్రజాశక్తి – కాళ్ల

దాతల సహకారంతో విద్యా సామగ్రి పంపిణీ చేయడం అభినందనీయమని ఎంఇఒ ఎ.రవీంద్ర అన్నారు. పెద అమిరం గ్రామంలో స్పెషల్‌ ప్రాథమిక పాఠశాలలో దాతల సహకారంతో సర్పంచి డొక్కు సోమేశ్వరరావు ఆధ్వర్యంలో 60 మంది విద్యార్థులకు విద్యా సామగ్రిని శుక్రవారం పంపిణీ చేశారు. సర్పంచి డొక్కు సోమేశ్వరరావు, మాజీ ఉప సర్పంచి కోరా రామ్మూర్తి నాయుడు, సరాబు ముకేష్‌ సుమారు రూ.20 వేల విలువైన నోట్‌ బుక్స్‌, పలకలు, ప్యాడ్స్‌ పంపిణీ చేశారు. అలుగు సెబాస్టీయన్‌ దాత రూ.65 వేల ఆర్థిక సహకారంతో టైల్స్‌ ఏర్పాటు చేశారు. పిల్లలకు మధ్యాహ్న భోజన పథకం నిర్వహణకు రూ.10 వేల విలువైన స్టీల్‌ గ్యాస్‌స్టవ్‌ అందజేశారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచి జవ్వాది లీలా కిషోర్‌, వార్డు సభ్యులు అలుగు క్రిష్టపర్‌, బిరుదుగడ్డ జాషువ, అలుగు సెబాస్టీయన్‌, అరేపల్లి పరమేశ్వర్‌, కేతా శ్రీనివాస్‌, ప్రధానోపాధ్యాయులు బివి.రామరాజు, ఉపాధ్యాయుడు గుదే సుబ్బారావు, ఉపాధ్యాయిని జి.సునీత పాల్గొన్నారు.వీరవాసరం :అందరికీ నాణ్యమైన విద్య అందించాలన్న ఉద్దేశంతో ప్రభుత్వ పాఠశాలలను ప్రభుత్వం బలోపేతం చేస్తోందని సర్పంచి కారిపెల్లి శాంతిప్రియ అన్నారు. మత్స్యపురి మండల ప్రాథమిక పాఠశాలలో శుక్రవారం సామూహిక అక్షరాభ్యాసం నిర్వహించారు. ప్రధానోపాధ్యాయిని ఎంవిడి భవాని ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో హైదరాబాద్‌కు చెందిన దాత కమలాపురం శ్రీరామ్‌ ఆర్థిక సహకారంతో చింతా నారాయణమూర్తి సహకారంతో రూ.ఇరవై వేల ఖరీదు చేసే విద్యాసామగ్రిని విద్యార్థులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఉపసర్పంచి జవ్వాది భాస్కరరావు, ఉపాధ్యాయులు మణికుమారి, ఎ.శ్రీరాములు, ఎస్‌.సావిత్రి, జి.కాశీఅన్నపూర్ణ, స్కూల్‌ ఛైర్మన్‌ కల్పనాదేవి పాల్గొన్నారు.ఉండి : గ్రామీణ ప్రాంతాల్లో విద్యాభివృద్ధికి దాతల సహకారం అవసరమని టిడిపి ఎంపిటిసి కునుకు రమాదేవి శ్రీనివాస్‌ అన్నారు. ఉండి కొత్తపేట మండల పరిషత్‌ పాఠశాలలో రమాదేవి శ్రీనివాస్‌ ఆర్థిక సహకారంతో విద్యార్థులకు శుక్రవారం విద్యాసామగ్రి అందజేశారు. ఈ సందర్భంగా ఎంపిటిసి రమాదేవి శ్రీనివాస్‌ మాట్లాడుతూ ఏటా తమ కుటుంబ సభ్యులు పేరిట విద్యార్థులకు విద్యాసామగ్రిని అందజేస్తున్నామన్నారు. కార్యక్రమంలో బాబు, రవి, బైరెడ్డి పైడియ్య పాల్గొన్నారు.

➡️