సీతారామపురం నార్త్‌లో నాయకర్‌ ప్రచారం

ప్రజాశక్తి – నరసాపురం

మండలంలోని సీతారా మపురం నార్త్‌ గ్రామంలో ‘మనం కోసం మనం నాయకర్‌’ కార్యక్రమం నిర్వహించారు. జనసేన ఎంఎల్‌ఎ అభ్యర్థి బొమ్మిడి నాయకర్‌ ప్రచారం చేపట్టారు. మాజీ ఎంఎల్‌ఎ బండారు మాధవ నాయుడు, టిడిపి ఇన్‌ఛార్జి పొత్తూరి రామరాజు, రాష్ట్ర కార్య నిర్వాహక కార్యదర్శి కొవ్వలి రామ్మోహన్‌ నాయుడు, జనసేన రాష్ట్ర కార్యదర్శి చాంగటి మురళీకృష ప్రచారం చేశారు. ఈ కార్యక్రమంలో చినమిల్లి సత్యనారాయణ, కలవకొలను తాతాజీ, ఆకన చంద్రశేఖర్‌, బందెల రవీంద్ర పాల్గొన్నారు.

➡️