ఉండి తహసిల్దార్ గా శ్రీనివాస్

Feb 5,2024 11:45 #West Godavari District
srinivasa as undi mro

ప్రజాశక్తి-ఉండి : ఉండి మండల తహసిల్దార్ గా కె శ్రీనివాస్ సోమవారం బాధ్యతలు స్వీకరించారు. ఎన్నికల బదిలీల లో భాగంగా ఇప్పటివరకు ఉండి తహసిల్దార్ గా బాధ్యతలు నిర్వహించిన ఏడిద శ్రీనివాస్ కృష్ణాజిల్లా గుడ్లవల్లేరుకు బదిలీ కాగా కృష్ణా జిల్లా ముదినేపల్లి మండల తహసిల్దార్ గా బాధ్యతలు నిర్వహిస్తున్న కే శ్రీనివాస్ సోమవారం ఉండి తహసిల్దార్ బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయనకు డిప్యూటీ తహసిల్దార్ ఎస్ వీరాస్వామి నాయుడు, మండల రెవెన్యూ ఇన్స్పెక్టర్ రేవు కార్తీక్, గ్రామ రెవెన్యూ అధికారుల సంఘం మండల అధ్యక్షులు ఎస్ చిన్నారావు, గ్రామ రెవెన్యూ సహాయకుల సంఘం నాయకులు పిల్లి సుబ్బారావు ఆధ్వర్యంలో రెవెన్యూ సిబ్బంది నూతన తహసిల్దార్ కే శ్రీనివాస్ కు పుష్పగుచ్చం ఇచ్చి స్వాగతం పలికారు. ఈ సందర్భంగా నూతన తహసిల్దార్ కే శ్రీనివాస్ మాట్లాడుతూ సహచర అధికారుల సమన్వయంతో మండల అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని అన్నారు.

➡️