సాబ్జీకి అంగన్వాడీ కార్యకర్తల ఘన నివాళులు

Dec 16,2023 16:52 #West Godavari District
wg anganwadi strike 5th day palakollu

ప్రజాశక్తి-పాలకొల్లు : ఉద్యోగులు, కార్మికుల ఉద్యమాలకు బాట వేసిన ఎమ్మెల్సీ సాబ్జీ మృతి కార్మిక, ఉపాధ్యాయ లోకానికి తీరని లోటని అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ తీవ్ర సంతాపం తెలిపింది. శనివారం పాలకొల్లు తహశీల్దార్ కార్యాలయం వద్ద అంగన్వాడీ కార్యకర్తలు 5వ రోజు ఆందోళన కొనసాగించారు. ఈ సందర్భంగా సాబ్జీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో సిపిఎం మండల కార్యదర్శి జవ్వాది శ్రీనివాస్, పురుషోత్తం, సీనియర్ ఉపాధ్యాయుల నేత వలవల శ్రీరామమూర్తి, డి అజయ్, అంగన్వాడీ నేతలు శ్రీదేవి, నాగలక్ష్మి, సత్యవతి, ఝాన్సీ, పద్మావతి, రూతు, ఎ లక్ష్మీ దుర్గ, పి ధనలక్ష్మి పాల్గొన్నారు.

➡️