ఇండియా కూటమి అభ్యర్థులను గెలిపించండి

Apr 25,2024 13:40 #Congress, #cpm, #West Godavari District
  • కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థి హరికుమార్రాజు

ప్రజాశక్తి-గణపవరం(పశ్చిగోదావరి) : రానున్న సార్వత్రిక ఎన్నికల్లో ఇండియా కూటమి అభ్యర్థులు గెలిపించాలని మతతత్వ బిజెపిని ఓడించి దేశ సమగ్రతను కాపాడాలని కోరుతూ గురువారం ఇండియా కూటమి ఉంగుటూరు నియోజకవర్గంలో కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థి పాతపాటి హరికుమార్‌ రాజు, సిపిఎం నాయకులు ప్రచారం నిర్వహించారు. మండలంలో అర్థవరం, జల్లి కొమ్మర, నిడమర్రు మండలంలో భువనపల్లి, అడవి కొలను గ్రామాల్లో ఈ ఎన్నికల ప్రచారం జరిగింది. ఈ సందర్భంగా ఇండియా కూటమి నాయకులు మాట్లాడుతూ.. ఇండియా కూటమితోనే దేశం అభివృద్ధి చెందుతుందన్నారు. మతతత్వ బిజెపిని దానిని బలపరిచే పార్టీలను ప్రజలు ఓడించాలన్నారు. పతి ఇంటికి వెళ్లి ఇండియా కూటమి ప్రజల కోసం ముద్రించిన సంక్షేమ కార్యక్రమాలతో ఉన్న కరపత్రాలను పంపిణీ చేస్తూ ఇండియా కూటమి అభ్యర్థులను గెలిపించాలని కోరారు.సిపిఎం నాయకులు మేడిశెట్టి పెంటారావు, గవర సత్యనారాయణ, కాంగ్రెస్‌ కార్యకర్తలు పాల్గొన్నారు.

➡️