సోమలలో గాలి వాన బీభత్సం

May 7,2024 12:34 #rain disaster, #somala

సోమల (చిత్తూరు) : సోమల మండలంలో సోమవారం రాత్రి 8 గంటల నుండి తొమ్మిది గంటల 20 నిమిషాల వరకు గాలి వాన బీభత్సం సృష్టించింది. మొదట ఎనిమిది గంటల సమయంలో గాలి ప్రారంభమై ఆ తర్వాత ఒక్కసారిగా భారీ వర్షం కురవడంతో విద్యుత్‌ సరఫరాలో అంతరాయం ఏర్పడింది. మంగళవారం ఉదయం మండలంలో గాలి వాన బీభత్సం కారణంగా జరిగిన నష్టాన్ని ప్రజాశక్తి విచారించగా… కందూరు కు చెందిన గాలి సురేష్‌ బొప్పాయి పంట పూర్తిగా నేలకు ఒరగడంతో రూ.20 లక్షల మేర నష్టం వాటిల్లిందని ప్రజాశక్తితో తెలిపారు. మండలంలో మామిడి పంటపై గాలివాన బీభత్సం తీవ్ర ప్రభావం చూపింది. గాలి వాన దెబ్బకు మామిడికాయలు రాలిపోవడంతో ఈరోజు ఉదయం తోట యజమానులు వాటిని పోగు చేస్తూ ఉండడం కనిపించింది. భారీ ఈదురుగాలిలో వర్షం కారణంగా విద్యుత్‌ సరఫరాలో అంతరాయం ఏర్పడింది. ఈరోజు మధ్యాహ్నం 12 గంటలకు కూడా విద్యుత్‌ సరఫరా కాలేదు. దీనిపై విద్యుత్‌ శాఖను వివరణ కోరగా బ్రేక్‌ డౌన్‌ కారణంగా విద్యుత్‌ సరఫరాలో అంతరాయం ఏర్పడిందని తెలిపారు.

➡️