స్వయం శక్తిగా ఎదగాలి

Nov 29,2023 13:28 #Vizianagaram
women empower

ప్రజాశక్తి-విజయనగరం కోట : మహిళలు సమాజంలో స్వయం శక్తిగా ఎదగాలని స్టేట్ బ్యాంక్ రీజనల్ మేనేజర్ విజయ్ సుబ్రహ్మణ్యం అన్నారు. బుధవారం నాడు స్థానిక ఆర్ అండ్ బి బంగ్లా కంటోన్మెంట్ విజయనగరం థెరిసా క్లబ్ నందు కుట్టు మిషన్లు శిక్షణ పూర్తి చేసుకున్న మహిళలకు సర్టిఫికెట్ల ప్రదానోత్సవం కార్యక్రమంలో పాల్గొన్న రీజనల్ మేనేజర్. అనంతరం ఆయన మాట్లాడుతూ స్త్రీలకు సంబంధించిన కుట్టు మిషన్లు ట్రైనింగ్, కంప్యూటర్ ట్రైనింగు ఎక్కడ ఎంతో చక్కగా నడపబడుతున్నాయి. మహిళల కోసం తెరిసా క్లబ్ నందు చేస్తున్న అభివృద్ధి బాగుందన్నారు ఈ ట్రైనింగ్ లో పూర్తి చేసుకున్న మహిళలకు ఎవరైనా సొంత షాపులు పెట్టదలుచుకుంటే వాళ్ల కాళ్లపై వారు నిలబడాలనుకున్న వారికి మా బ్యాంకుల సహకారంతో ముద్ర లోన్స్ ఇవ్వడం జరుగుతుందన్నారు. అటువంటి వారు ఎవరైనా బ్యాంక్ వచ్చి వెళ్లి సంప్రదించన్నారు. ఈ సందర్భంగా తెరిసా క్లబ్ జాయింట్ సెక్రెటరీ విజయకుమార్ మాట్లాడుతూ ఈ తెరిసా క్లబ్ నందు 1989 నుంచి మహిళలు ఎదుగుదలకు కృషి చేయడం జరుగుతుందన్నారు. ఈ ట్రైనింగ్ మూడు నెలలు ఉంటుంది ఒక బ్యాచ్కు 20 మంది అభ్యర్థులు చేర్చుకోవడం జరుగుతుంది. నామమాత్రపు ఫీజు తో ఇక్కడ శిక్షణ ఇవ్వడం జరుగుతుందన్నారు. అదేవిధంగా ప్రభుత్వ హాస్పిటల్ లో పేషెంట్లతో పాటు అటెండర్స్ గా సుధీర ప్రాంతాల నుంచి ఎవరైతే వచ్చి ఉంటారో అటువంటి వారికి క్లబ్ ద్వారా 220 మందికి రోజుకి భోజన సదుపాయాలు కల్పించడం జరుగుతుందన్నారు. ఈ భోజనాలకి సంబంధించిన నిత్యావసర సరుకులు దాతల సహాయ సహకారాలతో నడుస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో తెరిసా క్లబ్ ఫౌండర్ కెటి కొరియా కోస్, సెక్రెటరీ శ్రీనివాసరావు, ఆర్గనైజింగ్ సెక్రెటరీ ఎన్ వి రావు పాల్గొన్నారు.

➡️