నవ్వు దివ్య ఔషధం

May 5,2024 04:11 #edit page, #smile

నవ్వు ఓ అద్భుత ఉచిత దివ్య ఔషధం. నవ్వుల సుగుణాలతో మానవ సంబంధాలు, ప్రపంచ శాంతి, సోదరభావం, స్నేహ బంధాలు పెంపొందుతాయి. నవ్వడంతో శారీరక వ్యాయామం జరిగి జీవ వ్యవస్థ సర్దుకుంటుంది. నవ్వుల వల్ల వ్యాధి నిరోధకశక్తిని పెంచే టి-కణాలు ఉత్తేజితం అవుతాయి. నవ్వడం వల్ల రక్త ప్రసరణ సక్రమంగా జరిగి గుండె, ఊపిరి తిత్తులకు ఆరోగ్యం సిద్ధిస్తుంది. నవ్వడం వల్ల కండరాలకు వ్యాయామం కలుగుతుంది. శరీరం లోని స్ట్రెస్‌ హార్మోన్ల మోతాదు తగ్గుతుంది. అధిక రక్తపోటును తగ్గించడానికి నవ్వడమనే ఔషధాన్ని వాడాలి. నవ్వటం వల్ల ఎండార్ఫిన్‌ ఉత్తేజితం కావడంతో నొప్పులకు తాత్కాలిక ఉపశమనం కలుగుతుంది. ప్రతి రోజు 10-15 నిమిషాలు నవ్వటంతో దాదాపు 40 క్యాలరీలు ఖర్చు అవుతుంది. కోపం, ఉద్రేకం, ఆందోళన, ఒళ్లు నొప్పులు తగ్గుతూ జీవితకాలం పెరుగుతుంది. జ్ఞాపకశక్తి, సృజనశీలత, మానవ సంబంధాలు, ప్రాణవాయువు సరఫరాలను పటిష్ట పరిచే సహజ వ్యాయామంగా నవ్వులు ఉపయోగ పడతాయి. అందుకే వీలైనంత వరకు నవ్వుదాం, నవ్వులు పంచుదాం.

(మే5 ప్రపంచ నవ్వుల దినోత్సవం)

-డా||బుర్ర మధుసూదన్‌ రెడ్డి,
సెల్‌ : 9949700037

➡️