సీసాల్లో పెట్రోలు, డీజిల్‌ నింపొద్దు: ఈసీ

  • నిబంధనలు అతిక్రమిస్తే లైసెన్స్‌ రద్దు

ప్రజాశక్తి – అమరావతి బ్యూరో : పల్నాడు ప్రాంతంలో పెట్రోల్‌ బాంబులు బయటపడిన నేపథ్యంలో ఎన్నికల కమిషన్‌ అప్రమత్తమైంది. ఎన్నికల కమిషన్‌ ఆదేశాలతో ఆయా జిల్లాల కలెక్టర్లు శనివారం పెట్రోల్‌ బంక్‌ల యాజమాన్యం పాటించాల్సిన ఎన్నికల నియమావళి గురించి సర్క్కులర్స్‌జారీ చేశారు. మే నెల 10వ తేదీ వరకు పెట్రోల్‌ బంకుల్లో వాహనాలకు మాత్రమే పెట్రోల్‌ పోయాలని, కంటైనర్స్‌, బాటిల్స్‌, డ్రమ్స్‌తో పాటు ఎటువంటి పాత్రల్లో పెట్రోల్‌, డీజిల్‌ అమ్మరాదని, నియమావళిని ఉల్లంఘించి అమ్మకాలు చేస్తే ఆయా పెట్రోల్‌ బంక్‌ లైసెన్స్‌ను ఫ్లయింగ్‌ స్వ్కాడ్‌కు సిఫార్సు చేస్తామని ఆయా జిల్లాల కలెక్టర్లు పేర్కొన్నారు.

➡️