ఆయనను ఒప్పించడం కష్టమనుకున్నా..

Dec 19,2023 19:15 #movie, #prudhviraj sukumar

”సలార్‌’లో పృథ్వీరాజ్‌ సుకుమారన్‌ను సెకండ్‌ హీరోగా ఒప్పించడం కష్టమవుతుందేమో అనుకున్నా. కానీ, ఆయనకు స్క్రిప్ట్‌ నచ్చింది. వెంటనే అంగీకరించారు.” అని దర్శకుడు ప్రశాంత్‌ నీల్‌ అన్నారు. ప్రభాస్‌ హీరోగా నటించిన ‘సలార్‌’ చిత్రం డిసెంబర్‌ 22న ప్రేక్షకుల ముందుకు రానుంది. సినిమా ప్రమోషన్లలో భాగంగా ప్రశాంత్‌ నీల్‌ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ పృధీ¸్వరాజ్‌పై ప్రశంసలు కురిపించారు. ”వరదరాజ మన్నార్‌ పాత్రలో ఒదిగిపోయే నటుడి కోసం చాలా కసరత్తు చేశాం. బాలీవుడ్‌ నటులను తీసుకోవాలని కొందరు సలహాలిచ్చారు. ప్రేమ, ద్వేషం రెండూ చూపించగల నటుడు ఆయన మాత్రమే. పృథ్వీ ఒక సన్నివేశాన్ని నటుడి కోణంలోనే కాదు దర్శకుడిలా కూడా ఆలోచిస్తారు. ‘సలార్‌’ కోసం ఎన్నో ఆలోచనలు పంచుకున్నారు. ఒక్కమాటలో చెప్పాలంటే ఆయన లేకపోతే ‘సలార్‌’ లేదు’ అని అన్నారు.

➡️