ఆ మాటలు వెనక్కి తీసుకుంటున్నా : నాగబాబు

Mar 1,2024 08:25 #movie, #nagababu

సోషల్‌ మీడియా వేదికగా నటుడు నాగబాబు క్షమాపణలు చెప్పారు. ఈ మేరకు ఓ నోట్‌ను విడుదల చేశారు. ఇటీవల జరిగిన ‘ఆపరేషన్‌ వాలెంటైన్‌’ ప్రీరిలీజ్‌ ఈవెంట్‌లో తాను మాట్లాడిన మాటలను వెనక్కి తీసుకుంటున్నట్లుగా నాగబాబు తెలిపారు. ఈమేరకు ‘ఎక్స్‌’ వేదికగా క్షమాపణలు చెబుతూ నోట్‌ను విడుదల చేశారు. ‘పోలీస్‌ పాత్ర 6 అడుగుల 3 అంగుళాలు ఉండే వ్యక్తులు చేస్తే బాగుంటుంది. 5 అడుగుల 3 అంగుళాలు ఉండే వ్యక్తులు చేస్తే బాగుండదు’ అని నాగబాబు వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. ‘ఎవరైనా నా మాటలకు నొచ్చుకుని ఉంటే క్షమించండి..అవి యాదృచ్ఛికంగా వచ్చినవే కానీ…కావాలని అన్న మాటలు కాదు. అందరూ అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నా’ అంటూ రాసుకొచ్చారు. ఎత్తుకు సంబంధించిన తన తండ్రి చేసిన వ్యాఖ్యలు ఎవ్వరినీ ఉద్దేశించినవి కావని హీరో వరుణ్‌తేజ్‌ కూడా పేర్కొన్నారు. తన హైట్‌ను దృష్టిలో పెట్టుకుని చిన్న పోలిక చేశారనీ, ఏ హీరోను కించపర్చే ఉద్దేశ్యం లేదన్నారు.

➡️