‘ఓదెలా-2’లో తమన్నా

Mar 1,2024 19:10 #movie, #tammanna

అశోక్‌ తేజ్‌ దర్శకత్వంలో 2022లో వచ్చిన ‘ఓదెల రైల్వే స్టేషన్‌’కి సీక్వెల్‌ రాబోతోంది. ‘ఓదెలా-2’ టైటిల్‌తో తెరకెక్కుతోన్న ఈ చిత్రంలో తమన్నా నటిస్తున్నారు. మొదటి భాగంలో హెబ్బా పటేల్‌, పూజిత పొన్నాడ, వశిష్ఠ ప్రధాన పాత్రల్లో నటించారు. హెబ్బా పాటిల్‌ డీ గ్లామర్‌ పాత్రలో నటించి మెప్పించారు. ప్రస్తుతం షూటింగ్‌ పనులు ప్రారంభించిన ఈ మూవీ నుంచి చిత్రబృందం పోస్టర్‌ను విడుదల చేసింది. అయితే.. ఈ చిత్రం ‘ఓదెల రైల్వేస్టెషన్‌’ కు సీక్వెల్‌ కాదని చిత్రబృందం పేర్కొంది.

➡️