కల్కి ‘జస్ట్‌ ది వార్మ్‌ అప్‌’

Feb 25,2024 08:27 #movie, #prabhas

ప్రభాస్‌ హీరోగా నాగ్‌ అశ్విన్‌ తెరకెక్కిస్తున్న సైన్స్‌ ఫిక్షన్‌ థ్రిల్లర్‌ ‘కల్కి 2898’. ఈ సినిమా విడుదల వాయిదా పడే అవకాశాలున్నాయని సామాజిక మాధ్యమాల్లో జరుగుతున్న ప్రచారంపై చిత్ర బృందం క్లారిటీ ఇచ్చింది. ప్రభాస్‌కు సంబంధించిన ‘జస్ట్‌ ది వార్మ్‌ అప్‌’ అనే క్యాప్షన్‌తో వీడియో విడుదల చేసింది. మే 9న సినిమాను విడుదల చేస్తామని అందులో ప్రకటించారు. ప్రభాస్‌కు జోడీగా ఈ సినిమాలో దీపిక పదుకొనే నటిస్తున్నారు. ప్రతినాయకుడుగా కమల్‌హాసన్‌ కనిపిస్తారు. అమితాబ్‌బచ్చన్‌, పశుపతి, దిశా పటానీ కీలక పాత్రలు పోషిస్తున్నారు.

➡️