చిరుకు అభినందనల వెల్లువ

Jan 27,2024 08:05 #Megastar Chiranjeevi, #movie

దేశంలోనే అత్యున్నత పురస్కారం పద్మ విభూషణ్‌ అవార్డుకు ఎంపికైన చిరంజీవికి టాలీవుడ్‌తోపాటుగా దక్షిణాది సినీ పరిశ్రమకు చెందిన పలువురు ప్రముఖులు, బాలీవుడ్‌ ప్రముఖులు అభినందనలు తెలిపారు. మలయాళ మెగాస్టార్‌ మమ్ముట్టి చిరంజీవికి కంగ్రాట్స్‌ చెప్పారు. టాలీవుడ్‌ హీరోలు ఎన్‌టిఆర్‌, అక్కినేని నాగార్జున, అల్లు అర్జున్‌, రామ్‌చరణ్‌, మహేష్‌బాబు, నాని, కిరణ్‌ అబ్బవరం, తేజా సజ్జా, సత్యదేవ్‌, అడివి శేష్‌, నటిలు ఖుష్బూ సుందర్‌, జయప్రద, సుహాసిని, రాధిక శరత్‌కుమార్‌ ట్విట్టర్‌ ద్వారా అభినందలు తెలిపారు. ఇంకా అభినందనలు తెలిపిన వారిలో పలువురు హీరోలు, హీరోయిన్లు, నిర్మాతలు, దర్శకులు కూడా ఉన్నారు.

➡️