త్వరలో మ్యూజికల్‌ ఆల్బమ్‌ విడుదల

Mar 2,2024 19:15 #allari naresh, #movie

అల్లరి నరేష్‌ కెరీర్‌లో 61వ సినిమాగా రాబోతున్న ‘ఆ ఒక్కటి అడక్కు’ చిత్రం నుండి తాజా అప్డేట్‌ ఒకటి బయటికి వచ్చింది. ప్రస్తుతం పోస్ట్‌ ప్రొడక్షన్‌ పనులు జరుపుకుంటోన్న ఈ సినిమాకు సంబంధించిన ప్రమోషన్‌ కార్యక్రమాలు మొదలయ్యాయి. ఇందులో భాగంగా మ్యూజికల్‌ ఆల్బమ్‌ త్వరలో విడుదల కానున్నట్లు చిత్ర నిర్మాణ సంస్థ వెల్లడించింది. మ్యూజికల్‌ సంస్థ సరిగమ వేదికగా ఈ చిత్ర పాటలు విడుదల కానున్నట్లు తెలిపింది. ‘మోత మోగించడానికి మేము రెడీ’ అంటూ ట్విట్టర్‌ వేదికగా ప్రకటించారు. మల్లి అంకం ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. చిలకా ప్రొడక్షన్స్‌ బ్యానర్‌పై రాజేష్‌ నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో ‘జాతి రత్నాలు’ ఫేమ్‌ ఫరియా అబ్దుల్లా హీరోయిన్‌గా నటిస్తున్నారు. మార్చి 22న ఈ చిత్రం థియేటర్స్‌లో విడుదలకానుంది.

➡️