నడి సంద్రంలో ‘తండేల్‌’

Dec 26,2023 19:10 #movie, #nagachaithanya

నాగ చైతన్య నటిస్తున్న కొత్త చిత్రం ‘తండేల్‌’. చందూ మొండేటి తెరకెక్కిస్తున్న ఈ చిత్రం షూటింగ్‌పై తాజా అప్డేట్‌ని చిత్రబృందం విడుదలచేసింది. తాజా సమాచారం ప్రకారం సముద్రం మధ్యలో ఓ కొత్త షెడ్యూల్‌ మొదలుపెడుతున్నారు. అందులో చైతుపై కొన్ని సన్నివేశాలు షూట్‌ చేస్తున్నారు. అలాగే రానున్న రోజుల్లో మరిన్ని అప్డేట్స్‌ అందిస్తామని చిత్రబృందం తెలిపింది. ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్‌ సంగీతం అందిస్తుండగా సాయి పల్లవి హీరోయిన్‌గా నటిస్తున్నారు. గీతా ఆర్ట్స్‌ 2 నిర్మాణం వహిస్తున్నారు.

➡️