‘పుష్ప-2’ వాయిదా లేదు

Jan 12,2024 08:15 #movie

అల్లు అర్జున్‌ రష్మిక మందన్నా జంటగా నటిస్తున్న తాజా చిత్రం ‘పుష్ప-2’. ఈ ఏడాదిలో ఈ సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని షూటింగ్‌ వేగవంతం చేశారు. అయితే ఈ చిత్రంలో అల్లు అర్జున్‌ స్నేహితుడిగా కేశవ పాత్రలో నటిస్తున్న జగదీష్‌, హత్య కేసులో అరెస్ట్‌ అయ్యాడు. అప్పటి నుండి ఈ సినిమా విడుదల వాయిదా పడుతుందనే వార్తలు వినిపిస్తున్నాయి. గురువారం ఈ సినిమా డైరెక్టర్‌ సుకుమార్‌ పుట్టిన రోజు సందర్భంగా ఈ విషయంపై మైత్రీ మూవీ మేకర్స్‌ ఓ పోస్ట్‌ విడుదలచేశారు. ఆయనకు బర్త్‌ డే విషెస్‌ తెలుపుతూ ‘పుష్ప-2’ 2024 ఆగస్టు 15న విడుదల చేయనున్నట్లు స్పష్టం చేశారు.

➡️