ప్రభాస్‌ సినిమాలకు తాత్కాలిక విరామం ?

Jan 31,2024 19:35 #movie, #prabhas

హీరో ప్రభాస్‌ నటిస్తున్న తాజా చిత్రం కల్కి. ఆ తర్వాత రాజా సాబ్‌ సినిమాల్లో నటించనున్నారు. గతేడాది సలార్‌ సినిమా విడుదలైన విషయం తెలిసిందే. కల్కి సినిమా షూటింగ్‌ పూర్తయిన తర్వాత కొన్నాళ్లపాటు సినిమాలకు విరామం ఇవ్వాలని హీరో ప్రభాస్‌ నిర్ణయించుకున్నట్లుగా సమాచారం. గతంలో మోకాలికి గాయం కావటంతో విదేశాల్లో సర్జరీ జరిగింది. అయితే సినిమాలకు కాల్‌షీట్‌లు ఉండటంతో విశ్రాంతి పెద్దగా దొరకలేదు. కొన్ని రోజులు విశ్రాంతి తీసుకుని ఆ తర్వాత మళ్లీ షూటింగ్‌లకు వస్తారని సమాచారం.

➡️