… ఫొటో చాలా మాట్లాడుతుంది!

Jan 23,2024 19:05 #mahesh babu, #movie

మహేశ్‌బాబు, రాజమౌళి కాంబినేషన్లో రాబోతున్న ‘ఎస్‌ఎస్‌ఎంబీా29’ నుండి తాజా అప్డేట్‌ బయటికి వచ్చింది. రాజమౌళి, మహేశ్‌బాబు మిక్స్‌డ్‌ స్టిల్‌తో.. ‘క్యాప్షన్‌ లేదు.. ఫొటో చాలా మాట్లాడుతుంది.. ప్రీ ప్రొడక్షన్‌ వర్క్‌ కొనసాగుతోంది..’ అంటూ సోషల్‌ మీడియాలో ఓ పోస్టర్‌ బాగా వైరల్‌ అవుతోంది. ఆఫ్రికన్‌ అడ్వెంచరస్‌ ప్రాజెక్ట్‌గా రాబోతున్న ఈ చిత్రం స్క్రిప్ట్‌ వర్క్‌ పూర్తి చేశానని ఇప్పటికే రైటర్‌ విజయేంద్రప్రసాద్‌ చెప్పారు. ఈ చిత్రాన్ని 2026 ఉగాదికి విడుదల చేయనున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. ఎంఎం కీరవాణి ఇప్పటికే మ్యూజిక్‌ సిట్టింగ్స్‌ ప్రారంభించారు. అలాగే ‘అమృతం’ ఫేం ఎస్‌ఎస్‌ కంచి ఈ చిత్రానికి వన్‌ ఆఫ్‌ ది స్టోరీ రైటర్‌గా ఉన్నారు. యాక్షన్‌ డ్రామా నేపథ్యంలో రాబోతున్న ఈ చిత్రంలో పాపులర్‌ హిందీ యాక్టర్లతోపాటు స్టార్‌ యాక్టర్లను తీసుకోనున్నారు. రామోజీఫిలిం సిటీలో రూ.100 కోట్ల ఖర్చుతో భారీ సెట్‌లో షూటింగ్‌ చేయాలని చిత్రబృందం ఆలోచిస్తోంది. సినిమాలో ఎక్కువభాగం ఈ సెట్‌లోనూ, మిగిలిన భాగాన్ని ఆఫ్రికా, యూరప్‌లలో ప్లాన్‌ చేస్తున్నట్టు సమాచారం.

➡️