‘భామా కలాపం 2’ ట్రైలర్‌

Feb 11,2024 19:45 #movie, #priyamani

ప్రియమణి ప్రధాన పాత్రలో నటిస్తున్న ‘భామా కలాపం 2’ నుండి తాజాగా ట్రైలర్‌ విడుదలైంది. 2022లో ఓటీటీలో విడుదలైన ‘భామా కలాపం’ సినిమాకి ఇది సీక్వెల్‌గా వస్తోంది. అభిమన్యు దర్శకత్వం వహిస్తున్నారు. అనుపమ (ప్రియమణి) తన సొంత యూట్యూబ్‌ ఛానల్‌ ద్వారా వచ్చిన మనీతో హోటల్‌ పెట్టుకుందామనుకుంటుంది. ఈ క్రమంలోనే కుకింగ్‌ ఐడల్‌ 2023 సీజన్‌ స్టార్‌ అవుతుంది. అయితే కుకింగ్‌ ఐడల్‌ 2023లో పాల్గనడానికి వెళ్లిన అనుపమ అక్కడ ఎలాంటి పరిస్థితులు ఎదుర్కొంది. అసలు అనుపమకు డ్రగ్స్‌కు సంబంధం ఏంటి అనే విషయాలతో ఆసక్తికరంగా ట్రైలర్‌ కట్‌ చేశారు. ఈ సినిమా ఫిబ్రవరి 16 నుంచి ఆహాలో స్ట్రీమింగ్‌ కానుంది.

➡️