‘రాయన్‌’ వరలక్ష్మీ

Feb 27,2024 19:15 #movie, #varalakshmi

ధనుష్‌ హీరోగా, స్వీయ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘రాయన్‌’ చిత్రంలో నటిస్తున్న నటీనటుల వివరాలను చిత్రబృందం వరుసగా విడుదలచేస్తోంది. తాజాగా ఈ చిత్రంలో కీలక పాత్ర పోషిస్తున్న వరలక్ష్మీ శరత్‌కుమార్‌ లుక్‌ని రివీల్‌ చేశారు. ఈ చిత్రంలో ప్రకాష్‌ రాజ్‌, సందీప్‌ కిషన్‌, అపర్ణ బాలమురళీ, సెల్వ రాఘవన్‌, ఎస్‌ జె సూర్య, దుషారా విజయన్‌ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఏఆర్‌ రెహమాన్‌ సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని తెలుగు, తమిళ, హిందీ భాషల్లో విడుదల చేయనున్నారు.

➡️