శింబు సినిమాలో కమల్‌హాసన్‌

Feb 13,2024 19:25 #kamalhasan, #movie

తమిళ హీరో శింబు తన 48వ చిత్రానికి సిద్ధమవుతున్నారు. కమల్‌హాసన్‌ తన రాజ్‌కమల్‌ ఫిలిం ఇంటర్నేషనల్‌ పతాకంపై నిర్మించటానికి సన్నాహాలు చేస్తున్నారు. దీనికి దేశింగు పెరియసామి కళ, దర్శకత్వం బాధ్యతలను నిర్వహిస్తున్నారు. పిరియాడికల్‌ కథాంశంతో తెరకెక్కనున్న ఈ చిత్రం కోసం శింబు కుంగ్‌పూ, మార్షల్‌ ఆర్ట్స్‌లో శిక్షణ పొందుతున్నారు. ఈ సినిమాలో ఆయనే కథనాయకుడు, ప్రతినాయకుడిగా ద్విపాత్రాభినయం చేయబోతున్నారు. హీరోయిన్లుగా కీర్తి సురేష్‌, మృణాల్‌ ఠాకూర్‌ నటిస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రం ఫస్ట్‌లుక్‌ పోస్టర్‌ విడుదలైన విషయం తెలిసిందే. కమల్‌హాసల్‌ కీలకపాత్ర ఇందులో పోషించబోతున్నారు. మార్చి రెండోవారంలో ఈ సినిమా షూటింగ్‌ ప్రారంభం కానుంది.

➡️