హనుమాన్‌కు ప్రశంసలు

Jan 17,2024 19:30 #movie, #teja

సంక్రాంతికి హిట్‌ సినిమాగా నిలిచిన హనుమాన్‌పై టాలీవుడ్‌తోపాటుగా కన్నడ స్టార్‌ హీరోలు సైతం ప్రశంసలు కురిపిస్తున్నారు. ప్రశాంత్‌ వర్మ సినిమాఇక్‌ యూనివర్స్‌లో భాగంగా ఈ సినిమాను తెరకెక్కించిన విషయం తెలిసిందే. నటీనటులంతా నూరుశాతం తమ పాత్రలకు న్యాయం చేశారనీ, వరలక్ష్మి శరత్‌కుమార్‌ ప్రత్యేక ఆకర్షణగా నిలచారని కన్నడ హీరో శివరాజ్‌కుమార్‌ పేర్కొన్నారు. రిషబ్‌శెట్టి కూడా తన ఎక్స్‌లో ప్రత్యేకంగా అభినందించారు. హీరోయిన్‌ సమంత కూడా ‘మీరు అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకున్నారు’ అని ప్రశంసించారు. హీరో బాలకృష్ణ ఈ చిత్రాన్ని స్వయంగా చూసి అభినందించారు.

➡️