అజిత్‌ ద్విపాత్రాభినయం

కోలీవుడ్‌ హీరో అజిత్‌ తన 63వ చిత్రంగా ‘గుడ్‌ బ్యాడ్‌ అగ్లీ’లో నటిస్తున్నారు. ఇటీవల ఆయన నటించిన చిత్రం ‘తుణివు’ ఘన విజయం సాధించింది. ప్రస్తుతం ‘విడాయమర్చి’ చిత్రంలో హీరోయిన్‌గా త్రిషతో కలిసి నటిస్తున్నారు. మగిళ్‌ తిరుమేణి దర్శకత్వంలో లైకా ప్రొడక్షన్స్‌ సంస్థ భారీగా ఈ సినిమాను నిర్మిస్తోంది. సంగీతం అనిరుధ్‌ అందిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్‌ తుది దశకు చేరుకుంది. టాలీవుడ్‌కు చెందిన మైత్రీ మూవీస్‌ సంస్థ ‘గుడ్‌ బ్యాడ్‌ అగ్లీ’ చిత్రాన్ని నిర్మిస్తోంది. అజిత్‌ ద్విపాత్రాభినయం చేసే ఈ సినిమాను వచ్చే సంక్రాంతికి విడుదల చేస్తామని ఇప్పటికే చిత్రబృందం ప్రకటించింది. అజిత్‌ 2006లో కెఎస్‌ రవికుమార్‌ దర్శకత్వంలో వచ్చిన ‘వరలారు’ చిత్రంలో త్రిపాత్రాభినయం చేశారు.

➡️