‘సెలబ్రిటీలు కూడా మనుషులే’

May 7,2024 19:05 #movie

సిద్ధార్థ్‌ వల్లే తనకు ప్రేమపై నమ్మకం పెరిగిందని నటి అదితిరావ్‌ అన్నారు. గత నెలలో సిద్ధార్థ్‌- అదితిల నిశ్చితార్థం జరిగింది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆమె తమ అనుబంధంపై మాట్లాడారు. ‘సిద్ధార్థ్‌ నన్నెంతో మార్చాడు. అతడు పరిచయమయ్యాకే ప్రేమపై నమ్మకం మరింత పెరిగింది. ఎన్నో విషయాల్లో నా నమ్మకం నిజమైంది. మా ఇద్దరిది చిన్నపిల్లల స్వభావం. ప్రేమ ఉన్న చోట గౌరవం తప్పనిసరిగా ఉంటుంది. మేమిద్దరం ఒకరినొకరం ఎంతో గౌరవించుకుంటాం. నేను ప్రతి విషయాన్ని పాజిటివ్‌గా తీసుకుంటాను. నటీనటులపై రూమర్స్‌ రావడం సహజమే. మా ఇద్దరిపై గాసిప్స్‌ వచ్చాయి. వాటికి చెక్‌ పెట్టేందుకే నిశ్చితార్థం విషయాన్ని మీడియాకు వెల్లడించాం. విషయాన్ని తెలుసుకున్న వారు సంతోషించి శుభాకాంక్షలు తెలిపారు. వాళ్లందరికీ ధన్యవాదాలు. వాళ్ల అభిమానం ఎంతో విలువైనది’ అని చెప్పారు. సోషల్‌ మీడియా గురించి మాట్లాడుతూ.. ‘సెలబ్రిటీలు కూడా మనుషులే అని ప్రజలు గ్రహించాలి. వాళ్ల చుట్టూ తిరిగి వాళ్ల వ్యక్తిగత జీవితంలో ఏం జరుగుతుందో తెలుసుకోవాలనుకోవడం తప్పని తెలుసుకోవాలి. వారి గోప్యతకు భంగం కలిగించకూడదని నెటిజన్లు భావించాలి. అందరికీ చెప్పే విషయమైతే నటీనటులు స్వయంగా వెల్లడిస్తారు’ అని చెప్పారు.

➡️