ప్రముఖ తమిళ నటుడు డేనియల్‌ బాలాజీ గుండెపోటుతో మృతి

Mar 30,2024 09:11 #died, #Famous, #heart attack, #Tamil actor

చెన్నై : ప్రముఖ తమిళ నటుడు డేనియల్‌ బాలాజీ (48) గుండెపోటుతో కన్నుమూశారు. శుక్రవారం అర్థరాత్రి డేనియల్‌ కు ఒక్కసారిగా తీవ్రమైన ఛాతినొప్పి రావడంతో తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. గమనించిన కుటుంబీకులు వెంటనే చెన్నైలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. కానీ మార్గమధ్యమంలోనే డేనియల్‌ బాలాజీ మరణించినట్లు అక్కడి వైద్యులు తెలిపారు. ఆయన ఇప్పటికీ వివాహం చేసుకోలేదు. ఆయన వడ చెన్నై, కాఖా కాఖా, వేట్టైయాడు విళయాడు తదితర చిత్రాల్లో నటించారు. తెలుగులో టక్‌ జగదీశ్‌, ఘర్షణతో పాటు పలు దక్షిణాది సినిమాల్లో తన నటనతో ఆకట్టుకున్నారు. టీవీ సీరియళ్ల ద్వారా కెరీర్‌ ప్రారంభించిన డేనియల్‌.. ‘చిట్టీ’తో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. తెలుగు, మలయాళంతో కలిపి దాదాపు 40 సినిమాల్లో నటించారు. ఆయన మృతి పట్ల సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.

➡️