ఫిల్మ్‌ఫేర్‌ అవార్డును వేలం వేశా : విజయ్ దేవరకొండ

Apr 2,2024 19:30 #movie, #vijay devarakonda

2017లో సందీప్‌రెడ్డి వంగా దర్శకత్వంలో వచ్చిన అర్జున్‌రెడ్డి సినిమాలో నటనకుగాను తనకు ఉత్తమ నటుడిగా వచ్చిన ఫిల్మ్‌ఫేర్‌ అవార్డును వేలం వేశానని హీరో విజయ్ దేవరకొండ తెలిపారు. ఆయన నటించిన ‘ఫ్యామిలీ స్టార్‌’ సినిమా ఈనెల ఐదో తేదీన విడుదల కానుంది. సినిమా ప్రమోషన్‌లో భాగంగా విజయ్ దేవరకొండ తన వ్యక్తిగత వివరాలను వెల్లడించారు. ”నాకు అవార్డులంటే ఇష్టం ఉండదు. ఇప్పటివరకు వచ్చిన అవార్డుల్లో కొన్ని ఆఫీసులో ఉంటే మరికొన్ని ఇంట్లో ఉన్నాయి. 2018లో వచ్చిన ఫిల్మ్‌ఫేర్‌ అవార్డును 2019లో వేలం వేశాను. రూ.5 లక్షలు వస్తే చాలు అనుకుని ఆన్‌లైన్‌లో వేలం ప్రక్రియ ప్రారంభించాం. దివి ల్యాబ్స్‌ కుటుంబానికి చెందిన శ్యామలాదేవి రూ.25 లక్షలకు దక్కించుకున్నారు. ఆ రూ.25 లక్షల మొత్తాన్ని ముఖ్యమంత్రి సహాయనిధికి (సిఎంఆర్‌ఎఫ్‌)కు అందజేశాను.” అని వివరించారు.

➡️