సింపుల్‌గా హీరో వెంకీ రెండో కూతురి వివాహం..!

Mar 16,2024 11:05 #daughter, #Hero Venky, #marriage, #second

తెలంగాణ : విక్టరీ వెంకటేశ్‌ రెండో కూతురు హయవాహిని, విజయవాడకు చెందిన ఓ డాక్టర్‌ కుమారుడు నిషాంత్‌ ల పెళ్లి వేడుకలు నిన్న హైదరాబాద్‌లోని రామానాయుడు స్టూడియోలో జరిగాయి. కుటుంబ సభ్యులు, సన్నిహితుల మధ్య వీరిద్దరూ దంపతులయ్యారు. గతేడాది అక్టోబర్‌లో ఎంతో సింపుల్‌గా వీరి నిశ్చితార్థం జరిగింది. ఈ వివాహ వేడుకకు హీరోలు మహేశ్‌ బాబు, రానా, నాగచైతన్య తదితరులు హాజరై వధూవరులను ఆశ్వీర్వదించారు. ఈ వేడుకలకు బయటివారెవ్వరినీ ఆహ్వానించలేదు. ఈ వేడుకకు సంబంధించిన ఫోటోలు సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. వెంకటేష్‌, నీరజ దంపతులకు ముగ్గురు కూతుళ్లు, ఓ కొడుకు ఉన్నాడు. పెద్దమ్మాయి ఆశ్రితకు 2019లో పెళ్లి జరిగింది.

➡️