12 సినిమాలకు సంతకం చేశా, కానీ …

Apr 27,2024 19:30 #adyayan suman, #movie

‘రాజ్‌ 2 తర్వాత నేను ఒకేసారి 12 సినిమాలకు సంతకం చేశాను. ఇండిస్టీలో మంచి పేరొచ్చేసిందని ఓవర్‌ కాన్ఫిడెంట్‌గా ఫీలయ్యాను. రణ్‌బీర్‌ కపూర్‌, ఇమ్రాన్‌ ఖాన్‌ సరసన నా ఫోటో కూడా వేసి కొన్ని పత్రికలు ప్రచురించాయి. ఇది కదా అసలైన మజా అనుకున్నాను. అప్పుడే నా లైఫ్‌ యూటర్న్‌ తీసుకుంది. నా మూడో సినిమా జష్న్‌ బాక్సాఫీస్‌ వద్ద వర్కవుట్‌ కాలేదు. దీంతో నేను సంతకం చేసిన 12 సినిమాలు అర్ధాంతరంగా ఆగిపోయాయి. నిజానికి అది చాలా మంచి సినిమా. కానీ ఎందుకో ఆడలేదు. నటుడిగా నాకు పేరు తెచ్చినప్పటికీ తర్వాత సినిమాలన్నీ ఆపేయడంతో అవి దేనికీ పనికిరాకుండా పోయాయి. నాతో పాటు వచ్చినవాళ్లకు ఫ్లాప్స్‌ వచ్చినా సినిమాలు చేసుకుంటూ పోయారు. నేను మాత్రం ఒక్క హిట్టు, ఒక్క ఫ్లాప్‌ అందుకుని అక్కడే ఆగిపోయాను’ అంటూ బాలీవుడ్‌ నటుడు అధ్యాయన్‌ సుమన్‌ వాపోయారు. అధ్యాయన్‌ సుమన్‌, తండ్రి శేఖర్‌ సుమన్‌ ప్రస్తుతం ‘హీరామండి: ది డైమండ్‌ బజార్‌’ అనే వెబ్‌ సిరీస్‌లో నటించారు. ఈ సిరీస్‌ నెట్‌ఫ్లిక్స్‌లో మే 1 నుంచి స్ట్రీమింగ్‌ కానుందని ఓ వార్తా ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపారు.

➡️