దాడులపై ఈసీ చర్యలు తీసుకోవాలి : షర్మిల

అమరావతి : కడప పార్లమెంటు పరిధిలో జరుగుతున్న దాడులపై ఈసీ చర్యలు తీసుకోవాలని ఎపి కాంగ్రెస్‌ అధ్యక్షురాలు, కడప ఎంపి అభ్యర్థి వైఎస్‌ షర్మిల డిమాండ్‌ చేశారు. సోమవారం ఉదయం వైఎస్సార్‌ జిల్లా ఇడుపులపాయలో ఆమె ఓటేశారు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ … ఓటు అనేది పని కాదు, మన బాధ్యత అని అన్నారు. ప్రజలంతా ఓటు హక్కు వినియోగించుకోవాలని కోరారు. కడప పార్లమెంటు పరిధిలో జరుగుతున్న దాడులపై ఈసీ చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. ఏ ఒక్క పార్టీ వైపు ఈసీ పక్షపాత నిర్ణయం తీసుకోకూడదన్నారు. ఈవీఎంలు ధ్వంసం చేసిన వైసిపి అభ్యర్థిని బహిష్కరించాలని కోరారు. ఈ సందర్భంగా ఆమె తన తండ్రి తో దిగిన ఫోటోను షేర్ చేసారు.

➡️