20న ‘కన్నప్ప’ టీజర్‌ విడుదల

May 14,2024 19:55 #Manchu Vishnu, #movies

విష్ణు మంచు హీరోగా నటిస్తున్న చిత్రం ‘కన్నప్ప’. ‘మహాభారత్‌’ సిరీస్‌ ఫేమ్‌ ముఖేష్‌ కుమార్‌ సింగ్‌ దర్శకత్వంలో అవా ఎంటర్‌టైన్‌మెంట్‌, 24 ఫ్రేమ్స్‌ ఫ్యాక్టరీ బ్యానర్లపై మంచు మోహన్‌బాబు పాన్‌ ఇండియా స్థాయిలో ఈ సినిమా నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో ప్రభాస్‌, అక్షరు కుమార్‌, మోహన్‌బాబు, మోహన్‌ లాల్‌, శరత్‌ కుమార్‌, బ్రహ్మానందం వంటి వారు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ నెల 14 నుంచి 2 వరకూ కాన్స్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌ జరగనున్న విషయం తెలిసిందే. ఈ వేదికపైన 20న ‘ది వరల్డ్‌ ఆఫ్‌ కన్నప్ప’గా కన్నప్ప మూవీ టీజర్‌ని ఆవిష్కరించనున్నారు. ఈ విషయాన్ని విష్ణు మంచు సోషల్‌ మీడియా వేదికగా స్పష్టం చేశారు. ‘మేం ఎంతో ఇష్టంగా రూపొందిస్తున్న కన్నప్పను ప్రపంచ ప్రేక్షకులకు చూపించేందుకు కాన్స్‌ అనువైన వేదికగా ఉపయోగపడుతుంది. మన భారతీయ చరిత్రను ప్రపంచ వేదికపైకి తీసుకురావడం, మన కథలు, సాంస్కృతిక వారసత్వం గురించి ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రేక్షకులకు తెలియజేయడమే లక్ష్యంగా పెట్టుకున్నాం” అని ట్వీట్‌ చేశారు విష్ణు.

➡️