గాయకుడు పంకజ్‌ ఉదాస్‌ కన్నుమూత

Feb 26,2024 17:22 #Mumbai, #Pankaj Udhas, #singer

ముంబై : మ్యూజిక్‌ లెజెండ్‌, పద్మశ్రీ అవార్డు గ్రహీత పంకజ్‌ దాస్‌ (72) అనారోగ్యంతో కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన సోమవారం తుది శ్వాస విడిచారు. ఆయన మరణవార్తను పంకజ్‌ కుమార్త్‌ నయాబ్‌ ఉదాస్‌ సోషల్‌ మీడియాలో షేర్‌ చేశారు. గుజరాత్‌లోని జెట్‌పూర్‌ ప్రాంతంలో 1951 మే 17న ఆయన జన్మించారు. గజల్‌, నేపథ్య గాయకుడిగా గుర్తింపు పొందారు. ఆయన హిందీ సినిమా, భారతీయ పాప్‌ రచనలకు మంచి గుర్తింపు వచ్చింది. 1980లో ఆహత్‌ అనే గజల్‌ ఆల్బమ్‌తో తన కెరీర్‌ను ప్రారంభించారు. 1981లో ముకరర్‌, 1982లో తర్రన్నమ్‌, 1983లో మెV్‌ాఫిల్‌, 1984లో పంకజ్‌ ఉదాస్‌ లైవ్‌ ఎట్‌ రాయల్‌ ఆల్బర్ట్‌ హాల్‌, 1985లో నయాబ్‌ వంటి అనేక హిట్‌లను రికార్డు చేశారు. 2006లో ఆయన పద్మశ్రీ పురస్కారాన్ని అందుకున్నారు. 1970 నుంచి 2016 వరకూ పలు సినిమాల్లో పాటలు ఆలపించారు.

➡️