అభిమానులతో ‘గుంటూరు కారం’ మూవీ చూసిన మహేష్‌

Jan 12,2024 15:35 #mahesh babu

హైదరాబాద్‌ : సూపర్‌స్టార్‌ మహేష్‌బాబు నటించిన ‘గుంటూరు కారం’ సంక్రాంతి కానుకగా జనవరి 12న శుక్రవారం ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఈ సినిమాను మహేష్‌బాబు హైదరాబాద్‌ ఆర్టీసీ క్రాస్‌ రోడ్‌లోని సుదర్శన్‌ థియేటర్‌లో అభిమానులతో కలిసి వీక్షించారు. థియేటర్‌లో ఆయన తన అభిమానులతో సందడి చేశారు. ప్రస్తుతం దీనికి సంబంధించి ఫొటోలు, వీడియోలు సోషల్‌మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. కాగా, ‘గుంటూరు కారం’ మూవీని ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్‌ దర్శకత్వంలో తెరకెక్కింది. ఈ చిత్రంలో శ్రీలీల, ప్రకాశ్‌రాజ్‌, రమ్యకృష్ణ తదితరలు నటించారు.

➡️