మళ్లీ తెర మీదికి మీనా

May 13,2024 21:20 #meena, #movie

నటి మీనా వెండితెర మీద మళ్లీ కనిపించబోతున్నారు. నటుడు అజిత్‌ కథానాయకుడిగా నటిస్తున్న ‘గుడ్‌ బ్యాడ్‌ అగ్లీ’ చిత్రంలో ముగ్గురు కథానాయకిల్లో ఒకరుగా నటించటానికి సిద్ధమవుతున్నారు. బాలతారగా సినీరంగ ప్రవేశం చేసి స్టార్‌ కథానాయకిగా ఎదిగిన అతి కొద్ది మంది నటీమణుల్లో మీనా ఒకరు. బాల నటిగా రజనీకాంత్‌తో కలిసి నటించి, ఆ తర్వాత ఆయన సరసన కథానాయకిగా ఆమె నటించారు. తమిళ, తెలుగు, మలయాళ భాషల్లో సూపర్‌ స్టార్స్‌ అందరితోనూ జతకట్టారు. మలయాళ చిత్రం దృశ్యం వరకు కథానాయకిగా నటించారు. ఇప్పుడు తన వయసుకు తగ్గ పాత్రలో నటిస్తూ బిజీగా ఉన్నారు. అనారోగ్యం కారణంగా భర్త చనిపోవడంతో ఆమె కొంతకాలం ఆ బాధ నుంచి బయటపడలేకపోయారు. ఆ తర్వాత మళ్లీ కోలుకుని నటించడానికి సిద్ధమయ్యారు.

➡️