‘మిస్‌ జానకి’ షూటింగ్‌ ప్రారంభం

Apr 6,2024 19:11 #aswini sree, #movie

ఎన్‌ఎన్‌ చాందిని క్రియేషన్స్‌ బ్యానర్‌పై నాగరాజు నెక్కంటి నిర్మాణ సారథ్యంలో బిగ్‌బాస్‌ ఫేమ్‌ అశ్విని శ్రీ ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం మిస్‌ జానకి. సతీష్‌కుమార్‌ దర్శకత్వం వహిస్తున్నారు. సి.కళ్యాణ్‌ క్లాప్‌ కొట్టి సినిమాను ప్రారంభించారు. అనంతరం నటుడు మహేష్‌కుమార్‌ మాట్లాడుతూ ఈనెల 20 నుంచి ఏకధాటిగా 30 రోజులు రెగ్యులర్‌ షూటింగ్‌ జరుగుతుందన్నారు. ఆ తర్వాత మరో షెడ్యూల్‌తో షూటింగ్‌ను పూర్తిచేస్తామన్నారు. అశ్వినిశ్రీ మాట్లాడుతూ లేడీ ఓరియెంటెడ్‌గా ఈ సినిమా ఉంటుందన్నారు. శాని సాల్వమని, డాన్స్‌ మాస్టర్‌ సత్య మాట్లాడారు.

➡️