కాలిఫోర్నియా : గతేడాది విడుదలై సంచలనం సృష్టించిన ‘ఓపెన్‌హైమర్’కు ‘గోల్డెన్ గ్లోబ్’అవార్డుల పంట పండింది. ఉత్తమ నటుడు, దర్శకుడు, నటుడు (డ్రామా), సహాయ నటుడు అవార్డులను కైవసం చేసుకుంది. ఉత్తమ నటుడిగా సిలియన్ మర్ఫీ, ఉత్తమ దర్శకుడిగా క్రిస్టఫర్ నోలన్‌కు అవార్డులు దక్కాయి. క్రిస్టఫర్ నోలన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో సిలియన్ మర్ఫీ ప్రధాన పాత్రలో నటించారు. శాస్త్రవేత్త జె.రాబర్ట్ ఓపెన్‌హైమర్ జీవితం ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా ఘన విజయాన్ని అందుకుంది. కాలిఫోర్నియాలోని బేవర్లీ హిల్స్‌లో అవార్డుల వేడుక ఘనంగా జరిగింది. సిలియన్ మర్ఫీ ప్రధాన పాత్రలో నటించారు. మార్గోట్ రాబీ, ర్యాన్ గోస్లింగ్ ‘బార్బీ’ కూడా పలు కేటగిరీల్లో అవార్డులను సొంతం చేసుకుంది. ఉత్తమ చిత్రం- ఓపెన్‌హైమర్, ఉత్తమ కామెడీ చిత్రం- పూర్ థింగ్స్, ఉత్తమ దర్శకుడు -క్రిస్టఫర్ నోలన్ (ఓపెన్‌హైమర్), ఉత్తమ స్క్రీన్‌ప్లే-జస్టిన్ సాగ్ ట్రైట్, ఆర్ధర్ హరారి (అనాటమీ ఆఫ్ ఎ ఫాల్), ఉత్తమ నటుడు-సిలియన్ మర్ఫీ(ఓపెన్‌హైమర్), ఉత్తమ నటి-లిల్లీ గ్లాడ్‌స్టోన్(కిల్లర్స్ ఆఫ్ ది ఫ్లవర్ మూన్), ఉత్తమ హాస్య నటి-ఎమ్మా స్టోన్ (పూర్ థింగ్స్), ఉత్తమ హాస్య నటుడు-పాల్ గియామట్టి(ది హోల్డోవర్స్) తదితరులు అవార్డులు అందుకున్న వారిలో ఉన్నారు.