సూర్యకు జోడీగా పూజాహెగ్డే

May 18,2024 19:59 #New Movies Updates

కోలీవుడ్‌ హీరో సూర్యకు జోడీగా పూజాహెగ్డే నటించ బోతున్నారు. కొన్నాళ్ల క్రితం తెలుగులో వరస సినిమాలతో హిట్‌ కొట్టిన ఆమె ఆ తర్వాత వచ్చిన ఫ్లాప్స్‌ దెబ్బకు పూర్తిగా సినిమాలకు దూరంగా ఉంటున్నారు. సూర్య ‘కంగువ’ మూవీ చేస్తున్నాడు. ఈ ఏడాదే థియేటర్లలోకి రానుంది. మరోవైపు తన 44వ చిత్రాన్ని కూడా రెడీ చేసేస్తున్నాడు. దీనికి కార్తీక్‌ సుబ్బరాజ్‌ దర్శకుడు. సూర్య సొంత నిర్మాణ సంస్థ 2డీ ఎంటర్‌టెయిన్‌మెంట్స్‌, కార్తీక్‌ సుబ్బరాజ్‌ కలిసి సంయుక్తంగా నిర్మించనున్నారు. ఈ మూవీకి పూజా హెగ్డేని హీరోయిన్‌గా ఎంపికచేశారు. పదకొండేళ్ల క్రితం ‘మాస్క్‌’ అనే తమిళ సినిమాతోనే హీరోయిన్‌ అయిన పూజా హెగ్డే.. మధ్యలో విజరుతో ‘బీస్ట్‌’తో రీఎంట్రీ ఇచ్చింది. కానీ అది దెబ్బకొట్టింది. ప్రస్తుతం ఫ్లాప్స్‌ వల్ల పూర్తిగా ఛాన్సుల్లేక సైలెంట్‌ అయిపోయిన ఈమెకు.. సూర్య మూవీలో ఛాన్స్‌ అంటే బంపరాఫర్‌ అనే చెప్పొచ్చు. ఒకవేళ ఇది హిట్‌ అయితే మాత్రం మళ్లీ సౌత్‌లో పాగా వేసే ఛాన్స్‌ ప్లస్‌ కోరుకున్న బ్రేక్‌ రావొచ్చు.

➡️