ప్రముఖ దర్శక నిర్మాత రాజ్‌కుమార్‌ కోహ్లి కన్నుమూత

ముంబయి : ప్రముఖ దర్శక నిర్మాత రాజ్‌కుమార్‌ కోహ్లి (93) కన్నుమూశారు. ముంబయిలోని తన నివాసంలో శుక్రవారం ఉదయం గుండెపోటుతో ఆయన తుదిశ్వాస విడిచారు. ఈరోజు ఉదయం 8 గంటలకు స్నానం చేయడానికి బాత్రూమ్‌లోకి వెళ్లిన కోహ్లి ఎంతకూ బయటకు రాకపోవడంతో ఆయన కుమారుడు అర్మాన్‌ కోహ్లి తలుపుబద్ధలు కొట్టి లోనికి వెళ్లి చూడగా, కోహ్లి నిర్జీవంగా కిందపడి ఉన్నారు. ఆయన చనిపోయినట్లు కుటుంబీకులు గుర్తించారు. దర్శకుడి మరణ వార్త విన్న చిత్రపరిశ్రమ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. నేటి సాయంత్రం రాజ్‌కుమార్‌ కోహ్లి అంత్యక్రియలు నిర్వహించనున్నారు. రాజ్‌కుమార్‌ కోహ్లీ… జానీ దుష్మణ్‌, రాజ్‌ తిలక్‌, విరోధి, నాగిన్‌, పతీ పత్నీ ఔర్‌ తవైఫ్‌ సహా తదితర చిత్రాలను డైరెక్ట్‌ చేశారు. అలాగే పంజాబ్‌, హిందీ భాషల్లో ఎన్నో సినిమాలు నిర్మించారు. బాలీవుడ్‌ స్టార్స్‌ అయిన సన్నీడియోల్‌, సునీల్‌ దత్‌, మిథున్‌ చక్రవర్తి, అనిల్‌ కపూర్‌ వంటి పలువురు హీరోలతో సినిమాలు చేశారు.

➡️