జులై 5న జపాన్‌లో సలార్‌ రిలీజ్‌

జపాన్‌లో ఇండియన్‌ సినిమాలకు మంచి ఆదరణ ఉంది. అక్కడ భారతీయ సినిమాలు రికార్డు స్థాయిలో కలెక్షన్స్‌ రాబడుతున్నాయి. గతంలో బాహుబలి, ఆర్‌ఆర్‌ఆర్‌ తో పాటు కేజీయఫ్‌ పార్ట్‌ 1, పార్ట్‌ 2 చిత్రాలు కూడా జపాన్‌లో రిలీజై మంచి విజయాన్ని సాధించాయి. హీరో ప్రభాస్‌ నటించి ప్రశాంత్‌ నీల్‌ దర్శకత్వం వహించిన చిత్రం ‘సలార్‌’. గతేడాది డిసెంబర్‌ 22న పాన్‌ ఇండియా మూవీగా విడుదలై హిట్‌ టాక్‌ను అందుకుంది. థియేటర్స్‌లోనే కాకుండా ఓటీటీలోనూ ఈ చిత్రానికి మంచి రెస్పాన్స్‌ వచ్చింది. జులై 5న ఈ చిత్రాన్ని జపాన్‌లో గ్రాండ్‌గా రిలీజ్‌ చేయనున్నారు. ఈ విషయాన్ని అధికారికంగా తెలియజేస్తూ ట్రైలర్‌ని చిత్ర బృందం విడుదల చేసింది. ఒక్క డైలాగ్‌ కూడా లేకుండా కేవలం యాక్షన్‌ సీన్లతోనే కట్‌ చేసిన ఈ ట్రైలర్‌ ఆకట్టుకునేలా ఉంది. ఈ చిత్రంలో శృతిహాసన్‌ హీరోయిన్‌గా నటించగా పృథ్వీరాజ్‌ సుకుమారన్‌, జగపతి బాబు కీలక పాత్రలు పోషించారు.

➡️