శ్రీదేవి బయోపిక్‌ రాదు..

Apr 4,2024 19:46 #biopic, #New Movies Updates, #Sridevi

శ్రీదేవి బయోపిక్‌ విషయంపై బాలీవుడ్‌ నిర్మాత బోనీకపూర్‌ స్పందించారు. తాను బతికున్నంత కాలం తన భార్య శ్రీదేవి బయోపిక్‌ తీయలేరని తెలిపారు. గత కొన్ని రోజులుగా శ్రీదేవి బయోపిక్‌ రానున్నట్లు బీ టౌన్‌లో వార్తలు వస్తున్నాయి. ఈ వార్తలపై తాజాగా బోనీ కపూర్‌ మాట్లాడారు. ‘నా భార్య పర్సనల్‌ లైఫ్‌కు చాలా ప్రాధాన్యత ఇచ్చేది. పర్సనల్‌ విషయాలను బయటికి తెలియాల్సిన అవసరం లేదని తన అభిప్రాయం. అందుకే ఆమె ఆలోచనలను, వ్యక్తిత్వాన్ని నేను చాలా గౌరవిస్తాను. బయోపిక్‌ అంటే నిజాలను వక్రీకరించే అవకాశం ఉంది. అందుకే నా భార్య ఆలోచనల ప్రకారం తన బయోపిక్‌ తీయడానికి నేను ఒప్పుకొను. నేను బతికున్నంత కాలం ఆమె బయోపిక్‌ రాదు’ అని ఓ సినిమా ప్రమోషన్‌ కార్యక్రమంలో బోనీ కపూర్‌ మాట్లాడారు.

➡️