‘ది గర్ల్‌ఫ్రెండ్‌’ స్పెషల్‌ పోస్టర్‌ రిలీజ్‌

Apr 5,2024 20:40 #movie, #Rashmilka Mandanna

రష్మిక మందన్న, దీక్షిత్‌శెట్టి జంటగా నటిస్తున్న చిత్రం ‘ది గర్ల్‌ఫ్రెండ్‌’. అల్లు అరవింద్‌ సమర్పణలో గీతా ఆర్ట్స్‌, మాస్‌ మూవీ మేకర్స్‌, ధీరజ్‌ మొగిలినేని ఎంటర్‌టైన్‌మెంట్‌ బ్యానర్స్‌ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. దర్శకుడు రాహుల్‌ రవీంద్రన్‌. ధీరజ్‌ మొగిలినేని, విద్య కొప్పినీడి నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. రష్మిక పుట్టినరోజైన శుక్రవారం నాడు ఈ సినిమా నుంచి స్పెషల్‌ పోస్టర్‌ను నిర్మాతలు విడుదల చేశారు. కాలేజీ స్టూడెంట్‌ పాత్రలో ఆమె నటిస్తున్నట్లుగా పోస్టర్‌ను బట్టి తెలుస్తుంది. వైవిధ్యమైన ప్రేమకథా చిత్రంగా తెరకెక్కుతున్న ‘ది గర్ల్‌ ఫ్రెండ్‌’ చిత్రం ప్రస్తుతం రెగ్యులర్‌ షూటింగ్‌లో ఉందని నిర్మాతలు వెల్లడించారు. ఇప్పటికే 60 శాతం పూర్తయ్యిందనీ, మిగిలిన భాగాన్ని కూడా పూర్తి చేయటానికి సన్నాహాలు చేస్తున్నామని ప్రకటించారు. ఇప్పటికే పుష్ప-2 చిత్రం నుంచి రష్మిక ఫస్ట్‌ లుక్‌ పోస్టు విడుదలైన విషయం తెలిసిందే. ఈ ఏడాదిలో రష్మిక నటించిన నాలుగు సినిమాలు విడుదలకానున్నాయి.

➡️